ఎలాన్‌ మస్క్‌ పార్టీ ప్రకటన.. అమెరికాలో మూడో పార్టీ సక్సెస్‌ ఎలా ఉందంటే? | History of Third Political Parties in the USA Full Details | Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌ పార్టీ ప్రకటన.. అమెరికాలో మూడో పార్టీ సక్సెస్‌ ఎలా ఉందంటే?

Jul 6 2025 11:40 AM | Updated on Jul 6 2025 12:15 PM

History of Third Political Parties in the USA Full Details

వాషింగ్టన్‌: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో, అమెరికాలో మరోసారి మూడో రాజకీయ పార్టీ అంశం తెరపైకి వచ్చింది. కాగా.. దీనిని రిపబ్లికన్, డెమొక్రటిక్ అనే రెండు పార్టీల వ్యవస్థకు సవాల్‌గా మస్క్‌ అభివర్ణించారు.

అయితే, పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి పత్రాలనూ కమిషన్ ప్రచురించలేదు. ఆ పార్టీ అధికారికంగా నమోదైందా? లేదా? అనేది అమెరికా ఎన్నికల అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎలా ఉండబోతోందనే విషయాలను మస్క్ కూడా వెల్లడించలేదు. ఒకవేళ మస్క్‌ పార్టీని ఎన్నికల గుర్తిస్తే మూడో పార్టీ అవతరించే అవకాశం ఉంది. మస్క్‌ పార్టీ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగానే మారనుంది.

రెండు పార్టీలదే హవా..
ఇక, ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో మెజార్టీ అధ్యక్షులు కేవలం రెండు పార్టీల నుంచే వచ్చారు. అవే రిపబ్లికన్‌ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ‍ట్రంప్‌ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన వ్యక్తి. గత అధ్యక్షుడు జో బైడెన్‌ ‌డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఇదిలా ఉండగా.. అమెరికా ఇప్పటికే పలుమార్లు కొందరు వ్యక్తులు మూడో పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకే ఒకరు జార్జ్‌ వాషింగ్టన్‌ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. అమెరికాకు అధ్యక్షుడు అయ్యారు. ఆయన 1789-97 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు.  

ఇదిలా ఉండగా.. అమెరికా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. పలు పార్టీలను కొందరు నాయకులు ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకటి, రెండు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో ఓట్లను చీల్చగలిగాయి. అంతే తప్ప అధికారంలోకి మాత్రం రాలేకపోయాయి. మెజార్టీ నేతలు తమ మార్కును ఎన్నికల్లో చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎలాన్‌ మాస్క్‌ కొత్త పార్టీ.. అమెరికాలో ఎంత మేరకు ప్రభావం చూపించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికన్లు మస్క్‌ను ఎలా ఆదరిస్తారనేది హాట్‌ టాపిక్‌గా మారింది.

అమెరికాలో మూడో పార్టీ చరిత్ర ఇలా..

  • Anti-Masonic Party (1828): ఇది అమెరికాలో మొట్టమొదటి మూడో పార్టీగా గుర్తించబడుతుంది. మాసన్రి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఏర్పడింది.

  • Liberty Party (1840): దాస్యవ్యవస్థను వ్యతిరేకించడానికి ఏర్పడింది.

  • Free Soil Party (1848): స్లేవరీ విస్తరణకు వ్యతిరేకంగా.

  • Know-Nothing Party (1850): మైగ్రేషన్, కాథలిక్ వ్యతిరేక భావాలతో పనిచేసింది.

  • Populist Party (People’s Party, 1890s): రైతుల హక్కులు, ఫెడరల్ బ్యాంక్ రిఫార్మ్స్, డైరెక్ట్ సెనేటర్ ఎలెక్షన్స్ వంటివి మద్దతుగా ఉంది.

  • Progressive Party (1912): టెడి రూజవెల్ట్ నాయకత్వంలో ఏర్పడింది. సామాజిక న్యాయం, కార్మిక హక్కులు, వ్యాపార నియంత్రణపై దృష్టి సారించింది.

  • Socialist Party (1901-1950): యుజీన్ డెబ్స్ వంటి నాయకులు ప్రముఖులుగా నిలిచారు.

  • Libertarian Party (1971): వ్యక్తిగత స్వేచ్ఛ, ఉచిత మార్కెట్ సిద్ధాంతాలపై నమ్మకంతో ఏర్పడింది.

  • Green Party (1990): పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, శాంతి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రారంభమైంది.

  • Reform Party (1995): రాస్ పెరో స్థాపించాడు. ప్రభుత్వ ఖర్చులు తగ్గింపు, కరపన్ను సవరణలు వంటివి ప్రధాన అంశాలు.

అయితే, అమెరికాలో పలు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కేవలం మూడు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించాయి.

  • Theodore Roosevelt (Progressive Party 1912): మూడో పార్టీ అభ్యర్థిగా అత్యధిక ఓట్లు (27%) పొందిన అభ్యర్థి.

  • Ross Perot (Independent/Reform Party 1992): సుమారు 19% ఓటు బ్యాంక్‌ సంపాదించాడు.

  • George Wallace (American Independent 1968) : ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించారు.

  • Ralph Nader (Green Party 2000): ఎన్నికల్లో డెమోక్రాట్ల ఓటు చీల్చాడనే వాదన ఉంది.

  • RFK Jr Cornel West (Independent 2024): ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ప్రభావం చూపించకలేకపోయారు.

 

ఇప్పటి వరకు మూడో రాజకీయ పార్టీ, అభ్యర్థి సాధించిన ఓట్ల శాతం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement