Kamala Harris: రెండో డిబేట్‌కు నేను రెడీ | USA Presidential Elections 2024: Kamala Harris accepts CNN offer for 2nd presidential debate on Oct 23 | Sakshi
Sakshi News home page

Kamala Harris: రెండో డిబేట్‌కు నేను రెడీ

Sep 22 2024 2:09 AM | Updated on Oct 5 2024 1:57 PM

USA Presidential Elections 2024: Kamala Harris accepts CNN offer for 2nd presidential debate on Oct 23

సీఎన్‌ఎన్‌ ప్రతిపాదనకు హారిస్‌ ఓకే

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌తో రెండో అధ్యక్ష చర్చకు డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ సమ్మతించారు. అక్టోబర్‌ 23న జరిగే డిబేట్‌లో పాల్గొనాలని సీఎన్‌ఎన్‌ ఛానల్‌ పంపిన ఆహ్వానాన్ని శనివారం హారిస్‌ అంగీకరించారు. ట్రంప్‌తో వేదిక పంచుకోవడానికి ఉపాధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారని హారిస్‌ ప్రచార బృందం సారథి ఒమాలి డిల్లాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రెండో డిబేట్‌కు తాను సంతోషంగా సమ్మతిస్తానని హారిస్‌ శనివారం ట్వీట్‌ చేశారు. అక్టోబరు 23న ట్రంప్‌ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 10న జరిగిన తొలి డిబేట్‌లో ట్రంప్‌పై హారిస్‌ పైచేయి సాధించడం తెలిసిందే. మరో డిబేట్‌ ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్న విషయం తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement