‘ఓపెన్‌ఏఐతో మైక్రోసాఫ్ట్‌ సర్వనాశనం’ | Elon Musk provocative warnings both OpenAI and Microsoft chatgpt 5 | Sakshi
Sakshi News home page

‘ఓపెన్‌ఏఐతో మైక్రోసాఫ్ట్‌ సర్వనాశనం’

Aug 8 2025 2:40 PM | Updated on Aug 8 2025 3:25 PM

Elon Musk provocative warnings both OpenAI and Microsoft chatgpt 5

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రేసులో మాది గొప్ప అంటే మాది గొప్ప.. అంటూ చంకలు చరుచుకోవడం కంపెనీలకు అలవాటైంది. మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్‌ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్‌జీపీటీ-5 మోడల్‌ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. దీనిపై ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్‌ స్పందిస్తూ త్వరలో ఓపెన్‌ఏఐ మైక్రోసాఫ్ట్‌ను నాశనం చేస్తుందని చెప్పారు.

సత్య నాదెళ్ల పోస్ట్‌ చేస్తూ..‘ఈ రోజు జీపీటీ-5 మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్‌, కోపైలట్‌, గిట్‌హబ్‌ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీతో సహా మా ప్లాట్‌ఫామ్‌ల్లో లాంచ్ అవుతుంది. ఇది ఓపెన్‌ఏఐ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన మోడల్. ఇది రీజనింగ్, కోడింగ్, చాట్‌లో మెరుగైన పురోగతిని అందిస్తుంది. దీని మోడల్స్‌ అన్నీ అజూర్‌లో శిక్షణ పొందాయి. సామ్‌ఆల్ట్‌మన్‌ మాతో చేరి రెండున్నరేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాం. బింగ్‌లో జీపీటీ-4  ఇంప్లిమెంట్‌ చేసేందుకు సామ్‌ మాతో చేరారు. అప్పటి నుంచి ఎంతో సాధించాం. తాజా పురోగతితో వేగం పెరుగుతుంది. ఈ మోడల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.

ఇదీ చదవండి: ‘భారత్‌ను బెదిరిస్తారు’.. సూపర్‌ పవర్‌గా ఎదగాలంటే..

సత్య పోస్ట్‌పై ఎలాన​్‌మస్క్‌ స్పందిస్తూ.. ‘త్వరలో ఓపెన్‌ఏఐ మైక్రోసాఫ్ట్‌ను బ్రతికుండగానే మింగేస్తుంది’ అన్నారు. దీనిపై సత్య ప్రతిస్పందిస్తూ.. ‘కొందరు 50 ఏళ్లుగా అందుకోసం ప్రయత్నిస్తున్నారు. అదే సరదా అయిన విషయం! ప్రతిరోజూ మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. సృజనాత్మకతను జోడిస్తూ భాగస్వామిగా మారుతారు. తర్వాత ఇతరులతో పోటీపడతారు. అజూర్‌లో గ్రోక్ 4 వినియోగంపట్ల ఉత్సాహంగా ఉన్నాను. గ్రోక్ 5 కోసం ఎదురుచూస్తున్నాను!’ అని రాసుకొచ్చారు. ‘గ్రోక్ 4 హెవీ రెండు వారాల క్రితం జీపీటీ 5 కంటే స్మార్ట్‌గా ఉంది’ అని మస్క్‌ రిప్లై ఇచ్చారు. దాన్ని సూచించే కొన్ని డేటా పాయింట్లు ఉన్న పోస్ట్‌ను కోట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement