
పద్నాలుగేళ్ల వయసులోనే.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరిన 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi) గురించి పలు సందర్భాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కైరాన్.. మస్క్ కంపెనీ విడిచిపెట్టి న్యూయార్క్‌లోని సిటాడెల్ సెక్యూరిటీస్‌లో గ్లోబల్ ట్రేడింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్‌గా చేరనున్నాడు.
స్పేస్‌ఎక్స్‌లో రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత, కొత్త సవాళ్లను స్వీకరించడానికి.. నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి కొత్త కంపెనీలో చేరుతున్నట్లు కైరాన్ క్వాజీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. సిటాడెల్ సెక్యూరిటీస్ నాకు ఎంతగానో ఆసక్తికరమైన పనిని అప్పగిస్తూ పూర్తిగా కొత్త డొమైన్‌ను కూడా అందించిందని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకి
తొమ్మిదేళ్ల వయసులో మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటెల్ ల్యాబ్స్‌లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్‌షిప్ పొందిన కైరాన్ క్వాజీ.. 11 సంవత్సరాల వయసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో రీసర్చ్ ప్రారంభించాడు. 2022లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా నాలుగు నెలలు పనిచేశాడు. ఆ తరువాత స్పేస్‌ఎక్స్‌లో పనిచేయడమే ఉద్దేశ్యంగా అడుగులు వేసి, అనుకున్నది సాధించాడు.