మహబూబాబాదు జిల్లా: ఎవరైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే దాదాపు తపస్సు చేయాలి. కానీ, మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలానికి చెందిన ఓ యువకుడు ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా.. అనిపించాడు. మండలంలోని దుబ్బతండాకు చెందిన గుగులోత్ చందు పట్టుదలే పెట్టుబడిగా రెండు నెలల వ్యవధిలోనే ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేరళ గ్రామీణ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐడీబీఐతోపాటు ఎయిమ్స్ ఢిల్లీలో క్లర్క్ ఉద్యోగం సాధించాడు. కాగా, చందు ఢిల్లీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో క్లర్క్ ఉద్యోగంలో చేరాడు. ఈ సందర్భంగా చందును గ్రామస్తులు అభినందించారు.


