ఎలోన్ మస్క్ నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఈ వారం రెండోసారి పెద్ద సాంకేతిక అంతరాయాన్ని ఎదుర్కొంది. ఈ సమస్య వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌ను కూడా ప్రభావితం చేసింది.
డౌన్‌డిటెక్టర్ సమాచారం ప్రకారం, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటల సమయంలో ఎక్స్ సేవలు అందుబాటులో లేవని సుమారు 80,000కు పైగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు.
ఇలాంటి వరుస అంతరాయాల నేపథ్యంలో ఎక్స్ ప్లాట్‌ఫారమ్ స్థిరత్వం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో కంటెంట్‌ను సమర్థవంతంగా మోడరేట్ చేయగల సామర్థ్యంపై వినియోగదారుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.
2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను స్వాధీనం చేసుకున్న అనంతరం, సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించారు. దీని కారణంగా సాధారణ కార్యకలాపాలను నిరవధికంగా కొనసాగించడం, హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడం వంటి అంశాలపై అప్పటినుంచి సవాళ్లు తలెత్తుతున్నాయి.


