
టెక్ బిలియనీర్ల ప్రపంచంలో సుందర్ పిచాయ్, ఎలాన్‌మస్క్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ ఇంక్‌కు నాయకత్వం వహిస్తూ, బిలియనీర్ జాబితాలో ఇటీవల చోటు సంపాదించారు. టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ వ్యవస్థాపకుడిగా ఎలాన్‌మస్క్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. వీరు సారథ్యం వహిస్తున్న కంపెనీల ఉత్పత్తుల ద్వారా నిత్యం పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు వీరి నుంచి అకడమిక్ ప్రమాణాలతోపాటు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది.
సుందర్ పిచాయ్
చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ టెక్ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. చెన్నైలోని అశోక్ నగర్‌లో ఉన్న జవహర్ విద్యాలయంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. వానవాణి స్కూల్‌లో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలార్జీ ఇంజినీరింగ్ చేశారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ చేశారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి వార్టన్ స్కూల్ ద్వారా ఎంబీఏ చేశారు. గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్‌డాక్‌ల్లో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు.
ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’
ఎలాన్ మస్క్
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన ఎలాన్ మస్క్ చిన్న వయసులోనే కంప్యూటింగ్‌పై ఆసక్తి పెంచుకుని 10 ఏళ్లకే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. దక్షిణాఫ్రికాలోని తప్పనిసరి సైనిక సేవను నివారించడానికి క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చేరడానికి కెనడా వెళ్లారు. రెండేళ్ల తరువాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరారు. వార్టన్ స్కూల్ నుంచి ఫిజిక్స్, ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. మస్క్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అప్లైడ్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో పీహెచ్‌డీ కోసం కొంతకాలం చేరారు. కాని కొద్ది రోజులే అందుకు కొనసాగారు.