
బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ఎక్స్ఏఐ' (xAI).. యాపిల్ & ఓపెన్ఏఐపై సోమవారం టెక్సాస్‌లోని యూఎస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఏఐలో పోటీని అడ్డుకోవడానికి వారు చట్టవిరుద్ధంగా కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించింది.
యాపిల్, ఓపెన్ఏఐ రెండూ కూడా తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి.. ఎక్స్, ఎక్స్ఏఐ వంటి ఆవిష్కర్తలు పోటీ పడకుండా నిరోధించడానికి మార్కెట్లను లాక్ చేశాయని దావాలో పేర్కొన్నారు. ఎక్స్ఏఐ ఉత్పత్తులను అణిచివేయడానికి ఈ రెండూ పన్నాగం పన్నినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఓపెన్ఏఐతో.. యాపిల్‌కు ఒప్పందం లేకపోతే దాని యాప్ స్టోర్‌లో ఎక్స్, గ్రోక్ యాప్‌లకు ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వడం లేదు. మా సంస్థ యాప్‌ను ఎందుకు ముందుగా ప్రదర్శించడం లేదని ఎక్స్ఏఐ ప్రశ్నించింది. దీనిపై యాపిల్, ఓపెన్ఏఐ కంపెనీలు స్పందించలేదు.
ఇదీ చదవండి: ఇది పరిశ్రమకు కొత్త విజయగాథ: నరేంద్ర మోదీ
కాగా.. ఈ నెల ప్రారంభంలో, కాలిఫోర్నియాకు చెందిన యాపిల్ సంస్థ కుపెర్టినోపై దావా వేస్తానని మస్క్ పేర్కొన్నారు. యాపిల్ ''యప్ స్టోర్‌లో OpenAI తప్ప మరే AI కంపెనీ #1 స్థానానికి చేరుకోవడం అసాధ్యం'' అని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Apple is behaving in a manner that makes it impossible for any AI company besides OpenAI to reach #1 in the App Store, which is an unequivocal antitrust violation.
xAI will take immediate legal action.— Elon Musk (@elonmusk) August 12, 2025