బ్రిటన్‌లో ఉద్రిక్తత.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు | Elon Musk fightback call at London anti-immigration rally | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌లో ఉద్రిక్తత.. ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు

Sep 14 2025 10:52 AM | Updated on Sep 14 2025 11:44 AM

Elon Musk fightback call at London anti-immigration rally

లండన్‌: బ్రిటన్‌లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్‌ ర్యాలీ జరిగింది. లక్షల మంది పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలతో బ్రిటన్‌ నాశనం అవుతోంది అంటూ కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.

బ్రిటన్‌లో యాంటీ ఇమిగ్రేషన్‌ ర్యాలీ ఎలాన్‌ మస్క్‌ స్పందించారు. ఈ సందర్బంగా వీడియోలో మాట్లాడుతూ.. ‘భారీగా, అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోంది. వలసల కారణంగా హింస పెరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుంది. ఇ‍ప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే. మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు.. అని వారికి మద్దతు ఇచ్చారు. చివరగా.. బ్రిటన్‌లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నాను’ అని కామెంట్స్‌ చేశారు.

 

ఇదిలా ఉండగా.. శనివారం సెంట్రల్‌ లండన్‌లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది. ఈ సందర్భంగా ప్రజలందరూ..‘మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి వంటి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక, ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్-రైట్ కార్యకర్త టామీ రాబిన్‌సన్ నిర్వహించిన 'యునైట్ ది కింగ్‌డమ్' ర్యాలీ హింసాత్మకంగా మారింది. వలస విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనల్లో 26 మంది పోలీసు అధికారులు గాయపడగా, 25 మందిని అరెస్ట్ చేశారు.

మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో, సుమారు 1,10,000 నుంచి 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది నిరసనకారులు అదుపుతప్పి పోలీసులపై బాటిళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి వర్గాల నిరసనకారులను వేరుచేయడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. ఈ దాడుల్లో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో 'స్టాండ్ అప్ టు రేసిజం' సంస్థ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో వలసదారులకు మద్దతుగా మరో ప్రదర్శన కూడా జరిగింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement