
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ సీఈవో పదవి నుంచి లిండా యాకరినో(Linda Yaccarino) వైదొలిగారు. 2023 మే నుంచి రెండేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి ‘ఎక్స్’ (అంతకముందు ట్విటర్) వెళ్లిన తర్వాత తొలి సీఈవోగా లిండానే కావడం తెలిసే ఉంటుంది.
తన రాజీనామా విషయాన్ని స్వయంగా లిండా యాకరినో ఎక్స్‌వేదికగా ప్రకటించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు ఆమె సీఈవోగా కొనసాగారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ‘ఎక్స్’ బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు ‘xAI’తో కలిసి సంస్థ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది అని ఆమె పేర్కొన్నారు.
After two incredible years, I’ve decided to step down as CEO of 𝕏.
When @elonmusk and I first spoke of his vision for X, I knew it would be the opportunity of a lifetime to carry out the extraordinary mission of this company. I’m immensely grateful to him for entrusting me…— Linda Yaccarino (@lindayaX) July 9, 2025
xAI అనేది ఎలాన్ మస్క్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది Grok(గ్రోక్) అనే చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. అయితే లిండా రాజీనామా సమయంలో Grokపై వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆమె రాజీనామా వాటికి సంబంధం లేదని సమాచారం. ఇక ఎక్స్ కొత్త తదుపరి సీఈవో ఎవరనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎలాన్ మస్క్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.