
అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం 'టెస్లా' మార్కెట్లో సైబర్‌ట్రక్ లాంచ్ చేసి చాల రోజులే అవుతోంది. ఇటీవల ఈ కారుకు 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) క్రాష్ టెస్ట్ నిర్వహించింది.
ఎన్‌హెచ్‌టీఎస్ఏ నిర్వహించిన క్రాష్ టెస్టులో టెస్లా సైబర్‌ట్రక్ 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇది అన్ని టెస్టులలోనూ మంచి స్కోర్ సాధించి.. మొత్తం మీద సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైబర్‌ట్రక్‌కు టాప్ సేఫ్టీ రేటింగ్ అందుకుంది.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: మహీంద్రా కారుకు భారీ డిమాండ్: మూడు నిమిషాల్లో అన్నీ కొనేశారు
ప్రస్తుతం అమెరికన్ మార్కెట్లో టెస్లా సైబర్‌ట్రక్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కంపెనీ లాంచ్ చేసినప్పుడు దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) ఉండేది. ఇప్పుడు దీని ధర 15000 డాలర్లు పెరిగినట్లు సమాచారం.
Cybertruck receives top safety rating! https://t.co/H1wKwSlpYh
— Elon Musk (@elonmusk) August 22, 2025