
స్కోడా (Skoda) కంపెనీ భారతదేశంలో.. లాంచ్ చేయనున్న తన కొత్త 'ఆక్టావియా ఆర్ఎస్' (Octavia RS) కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. ఈ కారు కోసం రూ. 2.5 లక్షలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు అక్టోబర్ 17న లాంచ్ అయిన తరువాత.. నవంబర్ 6 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.
స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారును కంపెనీ.. కంప్లీట్ బిల్డ్ యూనిట్ (CBU) మార్గం ద్వారా దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీని ధరను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ధర రూ. 45 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?
కంపెనీ తన కొత్త స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారును కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అంటే.. దీనిని వందమంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కారు మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 216 హార్స్ పవర్, 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే కారు.. టాప్ స్పీడ్ 250 కిమీ/గం అని సమాచారం.