టెస్లా షేర్లు భారీగా కుదేలు | Musk have to close up shop and back home to South Africa said trump | Sakshi
Sakshi News home page

టెస్లా షేర్లు భారీగా కుదేలు

Jul 1 2025 8:36 PM | Updated on Jul 1 2025 9:05 PM

Musk have to close up shop and back home to South Africa said trump

ఒకప్పుడు ఉమ్మడి ఆకాంక్షలతో పరస్పర సహకారంతో కలిసి ప్రయాణం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య సమీకరణాలు పూర్తిగా మారాయి. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం రాజేసుకుంది. ఇటీవల ట్రంప్‌ ప్రతిపాదించిన ‘బిగ్‌ ‍బ్యూటిఫుల్‌ బిల్లు’ను ఎలాన్‌ మస్క్‌ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభనకు తెరతీసినట్లయింది. తాజాగా మస్క్‌ కంపెనీలకు అందిస్తున్న సబ్సిడీల్లో కోత విధిస్తే పరిస్థితి ఏమిటని ట్రంప్‌ ఎద్దేవ చేశారు. దానికి ప్రతిస్పందనగా అన్నీ రాయితీలు కట్‌ చేయడంటూ మస్క్‌ బదులిచ్చారు. ఇద్దరిమధ్య పెరుగుతున్న వ్యతిరేకతతో టెస్లా షేర్లు ఒక్క రోజులోనే 5 శాతంకు పైగా క్షీణించాయి.

ట్రంప్ ప్రతిపాదించిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును మస్క్ ‘ఆర్థిక నిర్లక్ష్యానికి చిహ్నం’గా అభివర్ణించారు. ప్రస్తుతానికి ఈ బిల్లు యూఎస్‌ సెనేట్‌లో ఆమోదం పొందింది. 51–49 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించారు. కానీ ప్రతినిధుల సభలో ఇంకా ఆమోదించాల్సి  ఉంది. ఈ బిల్లు అమెరికా ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మారుస్తుందని ట్రంప్‌ వాదిస్తుంటే.. కొంతమందికి భారీ పన్ను ఉపశమనం కలిగించేలా, మరికొందరికి ఖర్చులు పెరిగేలా, వలసలపై కఠిన వైఖరి ఉండేలా నిర్ణయాలున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

‘నేను ఈవీ మాండేట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఎలాన్ మస్క్‌కు చాలాకాలం ముందే తెలుసు. ఇది నా రాజకీయ ప్రచారంలోనూ కీలకంగా ఉంది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ కారును సొంతం చేసుకోవాలని బలవంతం చేయకూడదు. సబ్సిడీలు లేకుండా మస్క్‌ బహుశా తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’ అని ట్రంప్‌ అన్నారు. దాంతోపాటు టెస్లా, స్పేస్ఎక్స్ వంటి మస్క్ వెంచర్లు ప్రభుత్వ నిధులపై ఎంతగా ఆధారపడుతున్నాయో డోజ్‌ దర్యాప్తు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు.

ఇదీ చదవండి: డియర్‌ స్టాఫ్‌.. ఆరోగ్యం జాగ్రత్త!

మస్క్ స్పందన ఇలా..

ట్రంప్‌ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మస్క్ తన కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించాలని కోరారు. ‘నేను నిజంగా చెబుతున్నా.. అన్ని రాయితీలను కట్‌ చేయండి’ అంటూ తన ఎక్స్‌ ఖాతాలో రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement