
ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ‘ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ ఈమెయిళ్లు పంపుతోంది. పని గంటలకు మించి వర్క్ చేయకూడదని చెబుతూ వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై దృష్టి సారించాలని పేర్కొంటోంది. రిమోట్‌గా పని చేస్తోన్న కంపెనీ ఉద్యోగులు తప్పకుండా రెగ్యులర్ షెడ్యూల్స్‌మేరకే వర్క్ చేయాలని కోరుతోంది. ఈమేరకు ఉద్యోగులకు అంతర్గత ఈమెయిళ్లు పంపుతోంది. కంపెనీకి చెందిన టూల్స్‌లో తమ ఉద్యోగులు గడిపే సమయాన్ని సైతం ట్రాక్ చేస్తూ రిమైండర్ పంపుతుంది.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కంపెనీ హెచ్ఆర్ బృందం వారానికి ఐదు రోజులు, రోజుకు సగటున 9.15 పని గంటలు మించిన ఉద్యోగులకు హెల్త్ రిమైండర్ ఈమెయిల్స్ పంపుతోంది. ఈ ఈమెయిల్స్ వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడాన్ని హైలైట్ చేస్తున్నాయి. రిమోట్‌గా పనిచేసేటప్పుడు నిర్ణీత పని గంటలను అధిగమించకుండా చూసుకోవాలని తెలిపింది. ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఆరోగ్యకరమైన వర్క్-లైఫ్ సమతుల్యతను నిర్వహించాలని ఈమెయిల్స్‌లో స్పష్టమైన రిమైండర్ ఉన్నట్లు కొందరు ఉద్యోగులు తెలిపారు.
వృత్తిపరంగా చాలా అవసరం..
వ్యక్తిగత శ్రేయస్సుకు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక వృత్తిపరమైన ప్రభావానికి కూడా ఇది చాలా అవసరమని కంపెనీ పేర్కొంది. ఉద్యోగులు క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని, పనిఒత్తిడి ఉంటే వెంటనే తెలియజేయాలని, ఉద్యోగులు తమను తాము రిఫ్రెష్ కావడానికి వీలు కల్పించుకోవాలని తెలిపింది.
ఇదీ చదవండి: ‘సూపర్ యాప్’లో అన్ని రైల్వే సేవలు
గతంలో వారానికి 70 గంటలపాటు పని చేయాలని చెప్పిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి కంపెనీలో ఇలా వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు సంబంధించిన ఈమెయిళ్లు పంపడం ఉద్యోగుల్లో ఊరటనిస్తుంది. హైబ్రిడ్ వర్క్ మోడల్‌తోపాటు ఉద్యోగుల ఆరోగ్యంపట్ల కంపెనీ తీరును ఇవి హైలైట్ చేస్తున్నాయి.