భారత్‌లో స్టార్‌లింక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఎంతంటే.. | Starlink Monthly Cost Estimated depending on usage and region | Sakshi
Sakshi News home page

భారత్‌లో స్టార్‌లింక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఎంతంటే..

Jul 31 2025 10:05 AM | Updated on Jul 31 2025 10:16 AM

Starlink Monthly Cost Estimated depending on usage and region

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ సారథ్యంలోని ‘స్టార్‌లింక్‌’ ఇంటర్నెట్‌ సేవల సంస్థకు భారత్‌లో ద్వారాలు తెరచుకున్న నేపథ్యంలో సబ్‌స్క్రిప్షన్‌ ఎంత ఉండబోతుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భూటాన్‌, ఇండోనేషియా, ఒమన్‌, మాల్దీవులు.. వంటి ఆసియా దేశాల్లో స్టార్‌లింక్‌ వసూలు చేస్తున్న ఛార్జీలను పరిగణలోకి తీసుకుని భారత్‌లో నెలవారీ ఇంటర్నెట్‌ సర్వీసులు ఎంతో ఉండొచ్చనే దానిపై  కావాలనుకునేవారు ఎంత చెల్లించాలనే వివరాలపై కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి.

ఇదీ చదవండి: త్వరలో మడతెట్టే యాపిల్‌ ఫోన్‌?

స్టార్‌లింక్‌కు సంబంధించి కొన్ని అంశాలు..

  • ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్‌ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్‌గా ఉండొచ్చు.

  • మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్‌నెట్‌ అందిస్తారు.

  • వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

  • హార్డ్ వేర్ కిట్‌లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.

  • ఇంటర్నెట్‌ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్‌టెల్‌, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

  • బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.

  • 2025 చివరి నాటికి భారత్‌లో ఈ సర్వీసులు లాంచ్‌ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement