
భారతదేశంలో ట్రయల్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించడానికి, ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్టార్‌లింక్'.. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుంచి తాత్కాలిక స్పెక్ట్రమ్ క్లియరెన్స్‌ను పొందిందని. దీంతో కంపెనీ తన కార్యకలాపాలను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
స్పెక్ట్రమ్ క్లియరెన్స్ పొందటంతో.. స్టార్‌లింక్ ఇప్పుడు దాని గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించి, భద్రతా సమ్మతి పరీక్షలను నిర్వహిస్తుంది. దీనికోసం కంపెనీ ముంబై కేంద్రంగా 10 ప్రదేశాలలో బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
భారతదేశంలో తన గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి ల్యాండింగ్ స్టేషన్ హార్డ్‌వేర్‌తో సహా పరికరాలను తీసుకురావడానికి స్టార్‌లింక్ దిగుమతి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. అంతే కాకుండా.. స్టార్‌లింక్ ఇటీవలే తన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) కింద అన్ని భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) లైసెన్స్‌ను పొందిన తాజా ఆపరేటర్‌గా అవతరించింది. ఇప్పటికే 100 కంటే దేశాల్లో స్టార్‌లింక్ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: భారత్‌పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం
స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం ఆధార్ వెరిఫికేషన్
స్టార్‌లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్స్.. ఈ-కేవైసీ వెరిఫికేషన్ కోసం ఆధార్‌ను ఉపయోగించడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)తో ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం ఈకేవైసీ చేసుకున్న యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ ఆస్వాదించవచ్చు.