
చైనాలోని తియాన్‌జిన్‌లో షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఈ సదస్సులో రిసెప్షన్ వద్ద చైనీస్ హ్యుమానాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడి అతిధులు అడిగే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెబుతూ ఎంతగానో ఆకట్టుకుంది.
ఎస్‌సీవో సదస్సులో హ్యుమానాయిడ్ రోబో సమాధానాలు చెప్పడానికి సిద్ధం కావడానికి ముందు.. "నేను ఈ రోజు నా గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాను. నన్ను ప్రశ్నలు అడుగుతున్నందుకు ధన్యవాదాలు'' అని చెప్పింది.
భారతదేశంపై నీ ఆలోచలను చెప్పమని అడిగినప్పుడు.. నేను ఒక ఏఐ రోబోను. దేశాలు, రాజకీయ పరిణాలను గురించి నేను చెప్పలేనని స్పష్టం చేసింది. అయితే ఎస్‌సీవో సదస్సుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇది ఇంగ్లీష్, చైనీస్, రష్యన్ భాషలు మాట్లాడుతుంది.