breaking news
SCO summit
-
ట్రంప్‌తో జస్ట్ 30 సెకన్లు.. మోదీతో మాత్రం 45 నిమిషాలు
చైనా టియాంజిన్ వేదికగా జరిగిన షాంగై సదస్సు తర్వాత.. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు ద్వైపాక్షికంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే హోటల్లో భేటీ జరిగింది కేవలం 15 నిమిషాలుకాగా, మరో 45 నిమిషాల ఇద్దరూ కారులోనే ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వాళ్లేం మాట్లాడుకున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. షాంగై సదస్సు కోసం మోదీ రెండ్రోజులపాటు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. సదస్సు వేదికగా.. పహల్గాం ఉగ్రదాడిపై సభ్యదేశాల మద్దతును తీర్మానం రూపంలో కూడగట్టారాయన. అయితే సోమవారం సదస్సు తర్వాత.. మోదీ కోసం పుతిన్ 10 నిమిషాలు ఎదురు చూశారు. ఆపై మోదీతో కలిసి తన ప్రత్యేకమైన ఆరుస్ లిమోసిన్Aurus limousine కారులో మాట్లాడుకుంటూ ప్రయాణించారు. అమెరికాతో భారత్‌కు టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ఇద్దరూ భేటీ కావడం, పైగా ఆ కారు చాలా ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థతో కూడుకున్నది కావడంతో ఆటోమేటిక్‌గా ఏం మాట్లాడుకున్నారనే ప్రశ్న ఎదురైంది. అయితే అందులో పెద్ద రహస్యం ఏం లేదని చైనా పర్యటనలోనే ఉన్న పుతిన్ చెప్పుకొచ్చారు. ‘‘అందులో సీక్రెట్ ఏం లేదు. ఆలస్కా సదస్సులో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించా’’ అని ప్రెస్మీట్లో పుతిన్ చెప్పారు. అంతేకాదు.. అలస్కా భేటీ సమయంలోనూ ఆయన ట్రంప్‌తో కారులో ప్రయాణించిన విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. అలస్కా యాంకరేజ్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత పుతిన్, ట్రంప్‌కు చెందిన లిమోసిన్ ‘ది బీస్ట్’లో భేటీ జరగాల్సిన ప్రాంతం వద్దకు ప్రయాణించారు. అయితే.. ఎయిర్పోర్ట్ నుంచి వేదిక చాలా దగ్గర. అందుకే తమ మధ్య కేవలం 30 సెకన్లపాటే మాటలు జరిగాయని.. అదీ కూడా బ్రోకెన్ ఇంగ్లీష్‌లోనే సాగిందని అన్నారు. ఆ సమయంలో.. ట్రంప్ పూర్తి ఆరోగ్యవంతంగా కనిపించడంతో తాను సంతోషం వ్యక్తం చేశానని పుతిన్ అన్నారు. మరోవైపు.. రష్యా నేషనల్ రేడియో స్టేషన్ ‘వెస్టిఎఫ్ఎమ్’ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. మోదీ-పుతిన్‌లు తమ బృందాలతో చైనాలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. అంతకంటే ముందు.. ఆ వేదికకు చేరే క్రమంలో కారులో సుదీర్ఘంగా సంభాషించుకున్నారు అని తెలిపింది. మరోవైపు.. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. పుతిన్-మోదీ ముఖాముఖి మాట్లాడుకున్నారు. ఆయన(పుతిన్) తమ సంభాషణ మధ్యలో ఎలాంటి అంతరాయం కలగకూడదని భావించే కారులో ప్రయాణించారు’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు నేపథ్యంతో ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. భారత్ తమ దేశంపై అధిక సుంకాలు విధిస్తోందంటూ సంచలన ఆరోపణలకు దిగారాయన. ఈ పరిణామంపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇండియా, చైనాలాంటి దేశాలతో ఆ తీరున వ్యవహారించడం సరికాదని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు పుతిన్ డిసెంబర్లో భారత్ పర్యటనకు రానున్నారు, ఉక్రెయిన్ శాంతి చర్చలు.. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఆగస్టు 15న తటస్థ వేదికగా అలస్కాలో ట్రంప్-పుతిన్‌ల భేటీ జరిగింది. అయితే ఈ భేటీ ఫలవంతంగా జరగలేదని తెలుస్తోంది. మరోవైపు జెలెన్స్కీ-యూరప్ దేశాధినేతలతో వైట్‌హౌజ్‌లో జరిగిన చర్చలు మాత్రం సవ్యంగా సాగినట్లు సంకేతాలు అందాయి. దీంతో.. తదుపరి దశలో జరగబోయే అమెరికా-ఉక్రెయిన్-రష్యా త్రైపాక్షిక చర్చలపై ఉత్కంఠ నెలకొంది. -
రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్‌పింగ్‌లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.అమెరికా విధించిన టారిఫ్‌లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్‌ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. తాజాగా.. భారత్‌లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్‌కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్‌ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది. -
శుభ పరిణామం... త్రైపాక్షికం
ఏడేళ్ల అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిపిన పర్యటన అనేక విధాల సత్ఫలితాలనిచ్చింది. ఇది అంతర్జాతీయ పెత్తందార్లకు తగిన సందేశం పంపింది. పెహల్గామ్ ఉగ్రవాద దాడిపై మూణ్ణెల్లు గడిచినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)తో ఆ ఘటనను ఖండిస్తూ తీర్మానం చేయించింది. చైనా, రష్యాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రగతి సాధించింది. ఈ పరిణామాలన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు.అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా సృష్టించిన సరికొత్త గందరగోళం వల్ల ఏర్పడిన అయోమయ వాతావరణాన్ని ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు ఒక కుదుపు కుదిపింది. ప్రపంచవ్యాప్త మీడియా ఈ శిఖరాగ్ర సదస్సు కన్నా మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు చర్చించుకుంటున్న వీడియోకూ, ఛాయాచిత్రాలకూ అత్యధిక ప్రాధాన్యమివ్వటం మోదీ చైనా సందర్శనలోని అంతరార్థాన్నీ, దాని పరిణామాలనూ అవగాహన చేసుకోవటం వల్లే. అయితే కేవలం ఈ పర్యటన వల్లే అంతా మారిపోతుందనీ, చైనా మనతో సవ్యంగా ఉంటుందనీ, అమెరికా తన తెలివితక్కువ విధానాలను సవరించుకుంటుందనీ అనుకోనవసరం లేదు. ఇప్పటికైతే యూరేసియాలోని మూడు అగ్ర దేశాల కలయిక అవసరార్థ బంధమే. బలపడాలంటే చేయాల్సింది చాలా ఉంటుంది. రష్యాకిది వర్తించదు. ఆ దేశంతో మన మైత్రి చిరకాలమైనది. దాన్ని నీరుగార్చడానికి అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ అదేమంత తగ్గలేదు. కానీ పెరగాల్సినంత పెరగలేదు. ఈ మూడు దేశాల కలయికా ఈ దేశాల ప్రయోజనాలు నెరవేర్చుకోవటంతోపాటు ఈ ప్రాంత శాంతికీ, సుస్థిరతకూ, అభివృద్ధికీ దోహదపడుతుంది. దీని మూలాలు ప్రచ్ఛన్న యుద్ధానంతర పరిణామాల్లో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యాగా మిగిలిపోయిన 1990వ దశకంలో అప్పటి ఆ దేశ ప్రధాని యెవ్జెనీ ప్రైమకోవ్ ఈ భావనకు రూపుదిద్దారు. ఈ వ్యూహాత్మక కలయిక భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యా నికి చెక్ పెట్టగలదని భావించారు. మంత్రుల స్థాయిలో, నిపుణుల స్థాయిలో పలు సమావేశాలు కూడా జరిగాయి. కానీ 2020లో గల్వాన్ ఉదంతం అనంతరం నిలిచిపోయాయి. చైనాతో మనకున్న సరిహద్దు తగాదాలూ, చేదు అనుభవాలూ తక్కువేం కాదు. నిజానికి మొన్నటికి మొన్న ఎస్సీవో మంత్రుల స్థాయి భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో పెహల్గామ్ ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తూ మన దేశం దానిపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఎస్సీవో తన తప్పు దిద్దుకోవటం శుభæపరిణామం.ఈ త్రైపాక్షిక కలయికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనెంత కలవరపడుతున్నారో తెలుస్తుంది. ఇది ‘ఏకపక్ష విపత్తు’గా పరిణమిస్తుందట! ఆ దేశ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరేసరి. రోజుకో రకంగా నోరు పారేసు కుంటున్నారు. మన దేశం సంయమనంతో అమెరికా 50 శాతం సుంకాలు ఎంత అర్థరహితమో చెప్తూ వస్తోంది. తాను తప్ప దిక్కులేదనే స్థితికి చేరిన అమెరికా కళ్లు తెరిపించటం ప్రస్తుతావసరం. దేశాల మధ్య పటిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న కాలంలో తనకు అనుకూలమైన నిబంధనలతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను అమల్లోకి తెచ్చింది అమెరికాయే. పర్యవనసానంగా ఎడాపెడా ఆర్జించి, స్వీయ తప్పిదాల కారణంగా సంక్షోభంలో పడిన ఆ దేశం అందుకు ఇతరులను నిందిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. భారత–చైనా సంబంధాలపై రెండు వైపుల నుంచీ వెలువడిన ప్రకటనలు ఒకే స్వరంతో ఉండటం గమనించదగ్గది. ఇరు దేశాలూ భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కారని ఆ ప్రకటనలు గుర్తుచేశాయి. చైనాతో మన సంబంధాలు బాగున్నప్పుడు పాకిస్తాన్ అణిగిమణిగి ఉండటం మొదటినుంచీ కనబడుతోంది. ఇకపై కూడా అదే జరిగితే మంచిదే. ఏదేమైనా పెత్తందారీ పోకడలు చెల్లబోవని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. కాకపోతే భారత్–చైనా–రష్యా కలయిక వికసించాలంటే ఎంతో చిత్త శుద్ధితో, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది. అది జరగాలని ఈ మూడు దేశాలు మాత్రమే కాదు... ప్రపంచమే కోరుకుంటోంది. -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్‌లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్‌ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్‌నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్‌ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. షరీఫ్‌ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్‌కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్‌కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్‌పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, ఇటు పాక్ షరీఫ్‌కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్‌తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్‌ను గ్లోబల్ పవర్‌హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..
చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల టియాంజిన్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం మోదీ కోసం ఆ దేశంలోని ప్రతిష్టాత్మక వాహనంగా ఉన్న ‘హాంగ్కీ ఎల్ 5’ను ఏర్పాటు చేసింది. దీనికి చైనాలో అత్యంత ప్రముఖమైన, ప్రభుత్వ లగ్జరీ కారుగా గుర్తింపు ఉంది.హాంగ్కీ ఎల్ 5 ప్రత్యేకతలుహాంగ్కీ అంటే మాండరిన్ భాషలో ‘రెడ్ ఫ్లాగ్’ అని అర్థం.ఇది చైనా పురాతన ప్యాసింజర్ కార్ బ్రాండ్. దీన్ని 1958లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్ఎడబ్ల్యు) ప్రారంభించింది.ఎల్ 5 మోడల్‌ను చైనా అగ్రనేతల కోసం, ఎంపిక చేసిన విదేశీ ప్రముఖుల కోసం రిజర్వ్ చేశారు.అమెరికా అధ్యక్షుడు ప్రయానించే ‘బీస్ట్’కు ఆ దేశంలో ఎంత గుర్తింపు ఉంటుందో.. చైనాలో ‘హాంగ్కీ ఎల్ 5’కు అంత గుర్తింపు ఉంటుంది.5.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారు బరువు 3 టన్నుల కంటే ఎక్కువే. దీని విలువ సుమారు రూ.7 కోట్లు (సుమారు 8 లక్షల డాలర్లు)గా ఉంటుందని అంచనా. ఇందులో లెదర్, హ్యాండ్‌క్రాఫ్ట్ కలపతో ఇంటీరియర్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖులు సంభాషణకు సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ పంచ సూత్రాలు.. -
భారత్‌పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం
చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఈ సదస్సులో రిసెప్షన్ వద్ద చైనీస్ హ్యుమానాయిడ్ రోబో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడి అతిధులు అడిగే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెబుతూ ఎంతగానో ఆకట్టుకుంది.ఎస్సీవో సదస్సులో హ్యుమానాయిడ్ రోబో సమాధానాలు చెప్పడానికి సిద్ధం కావడానికి ముందు.. "నేను ఈ రోజు నా గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాను. నన్ను ప్రశ్నలు అడుగుతున్నందుకు ధన్యవాదాలు'' అని చెప్పింది.భారతదేశంపై నీ ఆలోచలను చెప్పమని అడిగినప్పుడు.. నేను ఒక ఏఐ రోబోను. దేశాలు, రాజకీయ పరిణాలను గురించి నేను చెప్పలేనని స్పష్టం చేసింది. అయితే ఎస్సీవో సదస్సుకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇది ఇంగ్లీష్, చైనీస్, రష్యన్ భాషలు మాట్లాడుతుంది. View this post on Instagram A post shared by Firstpost (@firstpost) -
పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చిన ప్రధాని మోదీ
-
SCO సదస్సులో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ
-
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిణమించిందని తియాన్జిన్ వేదికగా సోమవారం జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు‘‘ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఎస్సీవో సభ్య దేశంగా భారత్ కీలక భూమిక పోషిస్తోంది. ఎస్సీవో కోసం భారత్ విజన్, పాలసీ 3 పిల్లర్లపై ఆధారపడి ఉంది. భద్రత, అనుసంధానం, అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తాయి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు 2025(SCO Summit)లో మోదీ ప్రసంగించారు.సరిహద్దు ఉగ్రవాదం భారత్‌తో పాటు చైనాపైనా ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకూ ఇదొక సవాల్‌గా మారిందని మోదీ స్పష్టం చేశారు.ఈ సమస్యను ఎదుర్కొనడానికి పరస్పర సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. పాక్ ప్రధానిపై విసుర్లుSCO సదస్సు వేదికలో పాకిస్తాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదు అని స్పష్టం చేశారు. ‘‘ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలకు మా కృతజ్ఞతలు. అలాగే.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేం అంగీకరించబోం’’ అని వ్యాఖ్యానించారాయన. భద్రత ప్రతి దేశ హక్కు. ఉగ్రవాదం మనమందరికీ సవాల్. ఇది కేవలం భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు. SCO సభ్యదేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలి. అంతర్జాతీయంగా ఏకతా అవసరమని మోదీ పిలుపునిచ్చారు. ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పాక్‌కు అపమానకరమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు ముందు.. సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతలను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. పాక్ ప్రధాని వైపు కనీసం కన్నెత్తి చూడలేదు.పాక్ పేరు లేకుండానే.. సదస్సు ముగింపు ప్రకటనలో చైనా సహా యూరేషియన్(యూరప్+ఆసియా సమాహారం) దేశాలు భారత్ వైపు నిలిచాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఎస్సీవో సదస్సులో తీర్మానం చేశాయి. అయితే.. అందులో ఎక్కడా పాకిస్థాన్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. చైనా, టర్కీ సహా పలు దేశాలు పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశాయి. దాడికి పాల్పడినవారిని శిక్షించాలని వేదిక నుంచి గళం వినిపించాయి. ఉగ్రవాదం, విభజనవాదం, తీవ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని సభ్యదేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అదే సమయంలో.. పాక్‌లో జరిగిన జాఫర్ ఎక్స్‌ప్రెస్, ఖుజ్దార్ దాడులను కూడా ఖండించాయి.మరోవైపు.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్, చైనా అధినేతలు చర్చించుకున్నారు. ఈ విషయంలో భారత్ చైనా మద్దతు కోరగా.. చైనా అందుకు అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. -
Modi in China: షాంఘై శిఖరాగ్ర సమావేశం ప్రారంభం.. నేడు ప్రధాని మోదీ ప్రసంగం
తియాన్జిన్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు ఆదివారం రాత్రి తియాన్జిన్లో ప్రారంభమయ్యింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విందు కార్యక్రమంతో సదస్సు మొదలయ్యింది. నేడు సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.జిన్‌పింగ్ ఇచ్చిన విందు కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా వివిధ దేశాధినేతలు పాల్గొన్నారు. కూటమి దేశాల మధ్య ఐక్యతను, సహకారాన్ని పెంపొందించి, పురోగమనంలోకి పయనించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. దక్షిణార్థగోళ దేశాల బలాన్ని పెంపొందించేందుకు, మానవ నాగరికత మరింత పురోగమించడానికి వీలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా 20 మంది విదేశీ నేతలను, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులను ఈ సదస్సుకు జిన్‌పింగ్ ఆహ్వానించారు.సోమవారం వీరంతా కీలక సమావేశంలో పాల్గొననున్నారు. వేదికపై మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైనాతో సంబంధాలపై ఆయన ఈ సదస్సులో మాట్లాడే అవకాశం ఉంది. మోదీ సహా వివిధ దేశాధినేతలు జిన్‌పింగ్‌తో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాగా షాంఘై సహకార సంస్థ సదస్సులో వివిధ దేశాలు అభివృద్ధిపై వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు, భద్రత, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. PM Modi, President Putin and President Xi shared a light moment on the sidelines of the SCO Summit in China. pic.twitter.com/pEpAdF4qYi— Tar21Operator (@Tar21Operator) September 1, 2025 -
పుతిన్-మోదీ భేటీ వేళ.. జెలెన్స్కీకి ఫోన్‌కాల్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ వేదికగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ భేటీ కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ శాంతి చర్చల అంశంపై ఈ ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.కీవ్‌పై మాస్కో దాడుల ఉధృతమైన నేపథ్యంలో.. తాజా పరిస్థితులు, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశ వివరాలను జెలెన్స్కీ మోదీకి వివరించారు. అలాగే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు.‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన చర్చలో యుద్ధ పరిస్థితి, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్ శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని భారత ప్రధాని, జెలెన్స్కీతో ఫోన్‌కాల్ సారాంశాన్ని వెల్లడించారు. మరోవైపు.. జెలెన్స్కీ కూడా సంభాషణను ఉపయోగకరమైన, ముఖ్యమైన చర్చగా అభివర్ణించారు. అలస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం జరిగినప్పటి నుంచి.. రష్యా నుంచి శాంతి సంకేతాలు రాలేదని, రష్యా ఇటీవల తమ పౌరులపై దాడులు ఉధృతం చేస్తోందని, అసలు పుతిన్ శాంతి చర్చలకు సిద్ధంగా లేడని జెలెన్స్కీ అంటున్నారు. ఈ యుద్ధం ముగియాలంటే వెంటనే కాల్పుల విరమణ అమలు కావాలని అని జెలెన్స్కీ మోదీతో చెప్పినట్లు తెలుస్తోంది. -
చైనాలో అడుగుపెట్టిన మోదీ
తియాంజిన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. జపాన్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం సాయంత్రం చైనాకు చేరుకున్నారు. ఉత్తర చైనాలోని తియాంజిన్‌లో ఆదివారం, సోమవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర దేశాల అధినేతలతో సమావేశమవుతారు. తియాంజిన్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు సంప్రదాయ రీతిలో సంగీత, నృత్య కార్యక్రమాలతో స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్, చైనా కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతుండడం, మోదీ–జిన్‌పింగ్ భేటీ అవుతుండడాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అలాగే చైనా అధినేత జిన్‌పింగ్ 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. గణనాథుడి చిత్రాన్ని షేర్ చేసిన చైనా ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్.. వినాయకుడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరుదేశాలు కళలు, విశ్వాసం, సంస్కృతులను పంచుకున్నాయని వెల్లడించారు. ఇవి చైనాలోని టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహల్లోని గణనాథుడి ప్రతిమలు అని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య శతాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇవి అద్భుతమైన ప్రతీకలు అని యూ జింగ్ స్పష్టంచేశారు. #WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he arrives at a hotel in Tianjin, China. Chants of 'Bharat Mata ki jai' and 'Vande Mataram' raised by members of the Indian diaspora.(Video: ANI/DD) pic.twitter.com/hiXQYFqm07— ANI (@ANI) August 30, 2025 -
31న చైనాకు ప్రధాని మోదీ.. దౌత్య సంబంధాలపై చర్చ?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్లు 31న చైనాకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. 2019 తరువాత ప్రధాని మోదీ చైనాకు వెళుతున్న తొలి పర్యటన ఇది. తూర్పు లడఖ్, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సరిహద్దు వివాదాలపై భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు పూర్తిగా సద్దుమణగని ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ పర్యటన ఆసక్తికరంగా మారింది.ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు వెళ్లనున్నారు. ఈ సమావేశం టియాంజిన్‌లో జరగనున్నది. ఈ ఉన్నత స్థాయి దౌత్య భేటీ రెండు ఆసియా దిగ్గజాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచనున్నది. తూర్పు లడఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజింగ్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశం.. ఇటీవలే పూర్తి సభ్యత్వం పొందిన రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, ఇరాన్‌లతో సహా ఎనిమిది సభ్య దేశాల నేతలను ఒకచోట చేర్చనుంది. మోదీ చేస్తున్న ఈ పర్యటన పర్యటన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో వ్యక్తిగత సమావేశానికి మార్గం సుగమం చేయనుంది. 2020లో గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత వీరి మధ్య భేటీ జరగడం ఇదే మొదటిసారి.ఈ ఇరువురు నేతలు ఇటీవల జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలలో తారసపడినప్పటికీ, ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. అధికారిక ప్రకటన లేనప్పటికీ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చర్చలు జరగనున్నాయి.2020 మేలో జరిగిన గల్వాన్ ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు మరణించారు. చైనా కూడా కొందమంది సైనికులను కోల్పోయింది. అయితే వారి సంఖ్యను చైనా బహిరంగంగా వెల్లడించలేదు. కాగా త్వరలో జరగబోయే ద్వైపాకక్షిక సమావేశంలో భారత్- చైనా మధ్య ప్రత్యక్ష విమాన సంబంధాలను తిరిగి ప్రారంభించడంపై చర్చ జరగనున్నదని సమాచారం. అలాగే వీసాలను సులభతరం చేయడానికి, సరిహద్దుల్లో నదులకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు ప్రతిపాదనలు జరగనున్నాయని తెలుస్తోంది. -
SCO సదస్సులో పాకిస్థాన్ పై రాజ్ నాథ్ సింగ్ ఆగ్రహం
-
‘షాంఘై’ సదస్సుకు ప్రధాని దూరం
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లో వచ్చే నెలలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు (ఎస్సీవో)కు ప్రధాని మోదీ హాజరవడం లేదు. ఈ సదస్సుకు ప్రధాని స్థానంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ వెళ్లనున్నారు. జులై 3-4 తేదీల్లో జరగనున్న షాంఘై సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారని తొలుత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా ఆయన వెళ్లడం లేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం(జూన్28) మీడియా సమావేశంలో చెప్పారు. గత ఏడాది ఎస్సీవో సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వగా చైనా, రష్యా ప్రధానులు రాలేమని చెప్పడంతో వర్చువల్‌గా సదస్సును నిర్వహించారు. -
SCO Defence Ministers Meet: ఉగ్రవాదాన్ని పెకిలిద్దాం
న్యూఢిల్లీ: ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించి వేయాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ విషయంలో షాంఘై కో–అపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సభ్యదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉగ్రభూతం ఏ రూపంలో ఉన్నా ప్రమాదకరమేనని, దాన్ని అంతం చేయాల్సిందేనని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఎస్సీఓ సభ్యదేశాల రక్షణ శాఖ మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి అండదండలు అందించేవారి పీచమణచాలని చెప్పారు. కూటమిలోని సభ్యదేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరస్పరం గౌరవించుకొనేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేయాలని అన్నారు. చైనా, పాకిస్తాన్ తీరును పరోక్షంగా ఆయన తప్పుపట్టారు. ఎస్సీఓ సదస్సుకు రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. సభ్య దేశాల నడుమ విశ్వాసం, సహకారం మరింత బలోపేతం కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం శాంతి, భద్రతకు ఊతం ఇవ్వాలన్నదే తమ ఆశయమని వివరించారు. ఎస్సీఓ సదస్సుకు చైనా, రష్యా తదితర సభ్య దేశాల రక్షణశాఖ మంత్రులు హాజరయ్యారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హాజరు కాలేదు. ఆయన బదులుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు మాలిక్ అహ్మద్ ఖాన్ వర్చువల్‌గా పాల్గొన్నారు. షాంఘై సహకార కూటమి 2001లో షాంఘైలో ఏర్పాటయ్యింది. ఇందులో భారత్, రష్యా, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. 2017లో పాకిస్తాన్ శాశ్వత సభ్యదేశంగా మారింది. -
జనంలోకి జిన్‌పింగ్
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం జనబాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. ఉబ్బెకిస్తాన్‌లో సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ఈ వార్తలన్నీ ఉట్టి కాకమ్మ కథలే అని రుజువుచేస్తూ జిన్‌పింగ్ మంగళవారం బీజింగ్‌లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుచేసిన ఒక ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్‌పింగ్ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్‌పింగ్ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్‌పింగ్ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను జిన్‌పింగ్ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
SCO Summit 2022: యుద్ధాన్ని ముగించండి
సమకాలీన ప్రపంచంలో యుద్ధాలకు తావు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి తక్షణం ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సూచించారు. ఎస్ఈఓ సదస్సు సందర్భంగా పుతిన్‌తో మోదీ చర్చలు జరిపారు. చర్చలు, దౌత్యాల ప్రాధాన్యతను నొక్కిచెప్పారు. ‘‘ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం నేడు వర్ధమాన దేశాలకు అతి పెద్ద సమస్య. వీటికి వెంటనే పరిష్కారం కనిపెట్టేందుకు మీరు కృషి చేయాలి’’ అని పుతిన్‌కు సూచించారు. యుద్ధంపై భారత్ వైఖరిని, ఆందోళనను అర్థం చేసుకోగలనని పుతిన్ బదులిచ్చారు. దాన్ని వీలైనంత త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ, పుతిన్ సమావేశమవడం ఇదే తొలిసారి. చర్చలు అద్భుతంగా సాగాయంటూ మోదీ ట్వీట్ చేశారు. ‘‘వర్తకం, ఇంధనం, రక్షణ వంటి పలు రంగల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయించాం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలూ చర్చకొచ్చాయి’’ అని వివరించారు. రష్యాతో బంధానికి భారత్ ఎంతో ప్రాధాన్యమిస్తుందని పునరుద్ఘాటించారు. శనివారంతో 72వ ఏట అడుగు పెడుతున్న మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రేపు నా ప్రియమిత్రుడు పుట్టిన రోజు జరుపుకోనున్నారు. రష్యా సంప్రదాయంలో ముందుగా శుభాకాంక్షలు చెప్పరు. అయినా మీకు, భారత్‌కు శుభాకాంక్షలు. మీ నేతృత్వంలో భారత్ మరింత అభవృద్ధి చెందాలి’’ అని ఆకాంక్షించారు. గత డిసెంబర్లో తన భారత పర్యటన తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. -
Shanghai Cooperation Organisation: అనుసంధానమే బలం
సమర్ఖండ్: షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్యదేశాల నడుమ అనుసంధానం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. లక్ష్యాల సాకారానికి మెరుగైన అనుసంధానం, రవాణా సదుపాయాల విషయంలో పరస్పరం పూర్తి హక్కులు కల్పించడం ముఖ్యమన్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో శుక్రవారం ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్–రష్యా యుద్ధం దేశాలతో మధ్య రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అందుకే విశ్వసనీయమైన, ప్రభావవంతమైన, వైవిధ్యభరితమైన సప్లై చైన్లను అభివృద్ధికి సభ్యదేశాలన్నీ కృషి చేయాలన్నారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యధికంగా 7.5 శాతం వృద్ధి సాధించనున్నట్లు చెప్పారు. ఎస్సీఓ సభ్యదేశాల మధ్య మరింత సహకారం, పరస్పర విశ్వాసానికి భారత్ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలి ప్రపంచదేశాల్లో ఆహార భద్రత సంక్షోభంలో పడిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దీనికి ఆచరణీయ పరిష్కారముంది. తృణధాన్యాల సాగును, వినియోగాన్ని భారీగా ప్రోత్సహించాలి. తృణధాన్యాల సాగు వేల ఏళ్లుగా ఉన్నదే. ఇవి చౌకైన సంప్రదాయ పోషకాహారం. మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలి’’ అన్నారు. ప్రజలే కేంద్రంగా అభివృద్ధి మోడల్ ‘‘కరోనాతో ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అవి తిరిగి కోలుకోవడంలో ఎస్సీఓ పాత్ర కీలకం’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచ జీడీపీలో ఎస్సీఓ వాటా 30 శాతం. జనాభాలో 40 శాతం’’ అన్నారు. తయారీ రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతిభావంతులైన యువత వల్ల ఇండియా సహజంగానే ప్రపంచదేశాలకు పోటీదారుగా ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 7.5 శాతం వృద్ధితో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా ఎదగబోతున్నామని వివరించారు. టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకుంటున్నామని, తమ అభివృద్ధి మోడల్‌కు ప్రజలే కేంద్రమని తెలిపారు. ప్రతి రంగంలో నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తున్నామని, ఇండియాలో ప్రస్తుతం 70,000కు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇందులో 100కు పైగా యూనికార్న్ కంపెనీలు ఉన్నాయన్నారు. ఇండియా సంపాదించిన అనుభవం ఎస్సీఓలోని ఇతర దేశాలు సైతం ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌పై ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయడం ద్వారా తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకుంటామని చెప్పారు. ప్రపంచానికి భారత్ గమ్యస్థానం మెడికల్, వెల్నెస్ టూరిజంలో ప్రపంచానికి భారత్ గమ్యస్థానంగా మారిందని మోదీ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం తమదేశంలో పొందవచ్చని తెలిపారు. ఇక భారత్ సారథ్యం రొటేషన్ విధానంలో భాగంగా ఎనిమిది మంది సభ్యుల ఎస్సీఓ సారథ్యం ఉజ్బెకిస్తాన్ నుంచి భారత్ చేతికి వచ్చింది. 2023లో ఎన్సీఓ శిఖరాగ్రానికి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయంలో భారత్‌కు అన్నివిధాలా సహకరిస్తామని ఉజ్బెక్ అధ్యక్షుడు షౌకట్ మిర్జియోయెవ్ చెప్పారు. ఆయనతో కూడా మోదీ భేటీ అయ్యారు. పలకరింపుల్లేవ్.. కరచాలనాల్లేవ్ న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్లో ఎస్సీవో సదస్సుకు హాజరైన భారత్ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. శుక్రవారం ఒకే వేదికపైన ఫొటోల కోసం మిగతా నేతలతో కలిసి పక్కపక్కనే నిలబడిన సమయంలోనూ ఒకరినొకరు పట్టనట్లుగా వ్యవహరించారు. చిరునవ్వుతో పలకరించుకోలేదు. కరచాలనం చేసుకోలేదు. గల్వాన్ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం తెలిసిందే. అప్పటినుంచి వారు ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి. అమెరికాపై జిన్‌పింగ్ విమర్శలు ‘‘కొన్ని శక్తులు ఇంకా ప్రచ్ఛన్న యుద్ధ భావజాలం, ఏకపక్ష పోకడలు ప్రదర్శిస్తున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరతను విచ్ఛిన్నం చేయజూస్తున్నాయి’’ అని అమెరికానుద్దేశించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విమర్శలు గుప్పించారు. వాటిపట్ల ఎస్సీఓ సభ్యదేశాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రక్షణ సహా అన్ని రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం సభ్య దేశాలకు చెందిన 2,000 మంది సైనిక సిబ్బందికి చైనాలో శిక్షణ ఇస్తాం. ఉమ్మడి అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేసుకుందాం’’ అంటూ ప్రతిపాదించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహార ధాన్యాలు తదితరాల కోసం వర్ధమాన దేశాలకు 105 కోట్ల డాలర్ల మేరకు సాయం అందిస్తామని ప్రకటించారు. -
చైనా అధ్యక్షుడికి దూరం దూరంగా మోదీ.. నో స్మైల్, నో షేక్‌హ్యండ్
సమర్ఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ నగరంలో ఫాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ తదితర నేతలు హాజరయ్యారు. ఎస్సీఓ సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఒకే వేదికపై కనిపించారు. గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల తర్వాత వీరిద్దరూ అంతర్జాతీయ వేదికను పంచుకోవడం ఇదే తొలిసారి. అయితే చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ దూరం దూరంగా ఉన్నారు. వేదికపై ఫోటో దిగే సమయంలో ఇద్దరు నేతలు పక్కపక్కనే నిల్చున్నప్పటికీ కనీసం నవ్వలేదు. ఇరువురు కరచాలనం(షేక్‌హ్యండ్) కూడా చేసుకోలేదు. శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు పరస్పరం వ్యవహరించిన దూరం చూస్తుంటే భారత్-చైనా సరిహద్దు వివాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార-వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా 2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా 2020లో మయన్మార్ పర్యటన అనంతరం జిన్‌పింగ్ కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం కూడా ఇదే తొలిసారి. చదవండి: ‘ఈయనేం ప్రధాని.. దేశానికి తలవంపులు తెస్తున్నారు’ -
‘ఈయనేం ప్రధాని.. దేశానికి తలవంపులు తెస్తున్నారు’
వైరల్: పాకిస్థాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అంతర్జాతీయ వేదిక నుంచి నవ్వులపాలయ్యారు. ఉజ్బెకిస్తాన్ వేదికగా జరుగుతున్న షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సమ్మిట్ సందర్భంగా.. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అయితే.. ఈ భేటీలో పాక్ ప్రధాని షెహ్బాజ్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇయర్‌ఫోన్స్ పెట్టుకునే క్రమంలో ఆయన పడ్డ అవస్థలు చూసి.. పుతిన్ చిన్నగా నవ్వుకున్నారు. ఎంతకీ అవి సెట్ కాకపోవడంతో.. ‘ఎవరైనా వచ్చి సాయం చేయండి’ అంటూ కోరారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది నుంచి ఒకరు వచ్చి సాయం చేశారు. ఆ సమయంలోనూ షెహ్బాజ్ ఇబ్బందిగా ఫీల్ కావడంతో.. పుతిన్ నవ్వుకుంటూనే ఉన్నారు. This CrimeMinister is a constant embarrassment for Pakistan. Even President Putin had to eventually just laugh at this clumsy man. Pathetic. This is what conspirators wanted? To have by design a politician who would not only be a crook but also a pathetic apology for a PM? pic.twitter.com/mmEhLY7RZg — Shireen Mazari (@ShireenMazari1) September 15, 2022 When u are only there for a free trip & don't give a damn about your country u sleep thru meetings while the other side makes notes. Shameful & embarrassing behaviour of Imported govt at SCO. Who is responsible for inflicting this cabal of inept crooks on to the nation? pic.twitter.com/jAoZDWa8Xg — Shireen Mazari (@ShireenMazari1) September 16, 2022 ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. పాక్‌లో ట్రోల్ నడుస్తోంది. బయటా తన చేష్టలతో పాక్ పరువు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు కొందరు. ఇంకొవైపు ప్రతిపక్ష పీటీఐ షీరిన్ మజారీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎస్సీవో సమ్మిట్‌లో పాక్ బృందం తీరును ప్రశ్నిస్తూ.. ట్విటర్లో ఎండగడుతున్నారు. ఇదీ చదవండి: సేవింగ్స్ డబ్బులు ఇవ్వట్లేదని ఎంత పని చేసింది.. -
SCO Summit: ప్రధాని మోదీ కీలక భేటీపై ఉత్కంఠ
సమర్ఖండ్: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ నగరంలో శుక్రవారం ప్రారంభం కానున్న షాంఘై కో–ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ తదితర నేతలు హాజరుకానున్నారు. ఈ ఉదయం ప్రధాని మోదీ అక్కడకు చేరుకున్నారు. ఈ సదస్సులో ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వ్యాపార–వాణిజ్యం, ఇంధన సరఫరా వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కాత్ మిర్జీయోయెవ్‌తోపాటు ఇతర దేశాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అవుతారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 2001లో షాంఘైలో ఏర్పాటైన ఎస్సీఓలో చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఉజ్బెకిస్తాన్‌లో ఎస్సీఓ సదస్సు జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. సదస్సులో ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గురువారం ఉజ్బెకిస్తాన్‌కు బయలుదేరడానికి ముందు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిన్‌పింగ్, పుతిన్ సమావేశం చైనా, రష్యా అధినేతలు షీ జిన్‌పింగ్, పుతిన్ గురువారం సమర్ఖండ్లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రష్యాకు జిన్‌పింగ్ మద్దతు ప్రకటించారు. ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తామన్నారు. సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి ఉజ్బెకిస్తాన్‌లోని సమర్ఖండ్ సిటీకి చేరుకున్నారు. శుక్రవారం జరిగే సదస్సులో ఆయన పాలుపంచుకుంటారు. ఇదీ చదవండి: పాక్‌కు తాలిబన్ల కౌంటర్ -
ఒకే వేదికపై మోదీ, పుతిన్, జిన్‌పింగ్!
బీజింగ్: చైనా అధినేత జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. జిన్‌పింగ్ 2020 జనవరిలో మయన్మార్ పర్యటన తర్వాత కరోనా నేపథ్యంలో విదేశాలకు వెళ్లడం మానుకున్నారు. ఎస్సీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, భారత్, పాకిస్తాన్ సభ్యదేశాలు. ఇరాన్‌ను సైతం చేర్చుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది. ఇంకోవైపు ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఆగ్రహంతో ఉన్నాయి. ఈ తరుణంలో ఆంక్షల నడుమ ఉన్న రష్యా ఈ భేటీలో పాల్గొనడం, ఇంకోవైపు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరుపై అగ్రరాజ్యం గుర్రుగా ఉంది. భారత్ తరపున ప్రధాని మోదీ సైతం పాల్గొనబోతుండడంతో.. జిన్‌పింగ్‌తో భేటీ అవుతారా? అనే విషయంపైనా ఓ సంగ్దిగ్ధత నెలకొంది. ఇదీ చదవండి: ప్రజల్ని బెదిరిస్తారా? ఏం తమాషాగా ఉందా? -
Narendra Modi: ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం
న్యూఢిల్లీ: ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు ఉమ్మడిగా ఒక కార్యాచరణ రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదం పెచ్చుమీరుతోందనడానికి ఇటీవల అఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయని, ప్రాంతీయంగా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో అంతర్జాతీయ సమాజం ఆలోచనాత్మకంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహకారాన్ని అడ్డుకోవడానికి ఎస్సీఓ సమష్టిగా చర్యలు చేపట్టాలని కోరారు. మధ్య ఆసియా సాంస్కృతిక, చారిత్రక ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉగ్రవాద శక్తులపై పోరాటానికి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నారు. దేశాల మధ్య అనుసంధానం అవసరం మధ్య ఆసియాలో వివిధ దేశాల మధ్య భౌగోళికంగా అనుసంధానం ఉంటే మార్కెట్ మరింత విస్తృతమవుతుందని నరేంద్ర మోదీ వివరించారు. మధ్య ఆసియా, భారత్‌కు మధ్య కనెక్టివిటీ పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం లేకపోవడంతో వల్ల భౌగోళికంగా అడ్డుగోడలు ఏర్పడుతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని, ప్రాజెక్టుల నిర్మాణం పారదర్శకంగా జరగాలని హితవు చెప్పారు. ఎస్సీఓలో కొత్తగా చేరిన సభ్యదేశం ఇరాన్‌కు మోదీ స్వాగతం పలికారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడం సరికొత్త వాస్తవం అని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆ దేశంలో మళ్లీ ఘర్షణలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజంపై ఉందన్నారు. ఉగ్రవాదులకు అఫ్గాన్ ఆశ్రయం ఇవ్వదని తెలిపారు. చైనాయే తమకు నమ్మకమైన నేస్తమని ఇమ్రాన్ మరోసారి స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్ నుంచి విదేశీ బలగాలు వెళ్లిపోయాక ఒక కొత్త చరిత్ర మొదలైందని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ అన్నారు. అయినప్పటికీ ఆ దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఎస్సీఓ సభ్య దేశాలు అఫ్గాన్‌కు అన్ని విధాల సహకరించాలని పిలుపునిచ్చారు. చదవండి: ఈ ఏడాది ఎక్కువ నష్టపోయిన వ్యక్తి.. ఏకంగా రూ. 1.98 లక్షల కోట్లు -
17న ‘షాంఘై’ భేటీలో మోదీ ప్రసంగం
న్యూఢిల్లీ: తజకిస్తాన్ రాజధాని దుషాంబేలో 17న ప్రారంభంకానున్న వార్షిక షాంఘై సహకార సంఘం(ఎస్సీవో) సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ(వర్చువల్) పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ నేరుగా దుషాంబేకు వెళ్లి అక్కడ జరుగుతున్న ఎస్సీవో సదస్సులో పాల్గొని భారత అభిప్రాయాలను పంచుకోనున్నారు. అఫ్గాన్ సంక్షోభం కారణంగా తలెత్తే పరిణామాలపై సదస్సులో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశముందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమలి రహ్మాన్ అధ్యక్షత ప్రారంభమయ్యే 21వ ఎస్సీవో సదస్సులో సభ్య దేశాల అగ్రనేతలు నేరుగా, వర్చువల్ పద్ధతిలో ప్రసంగించనున్నారు. భారత ప్రతినిధి బృందం తరఫున ప్రధాని మోదీ సదస్సు ప్లీనరీ సెషన్లో ప్రసంగించనున్నారు’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈసారి సమావేశాల్లో ఎస్సీవో సభ్య దేశాల నేతలు, పరిశీలక దేశాలు, ఎస్సీవో ప్రధాన కార్యదర్శి, ఎస్సీవో ప్రాంత ఉగ్రవ్యతిరేక విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్య అతిథులు పాల్గొననున్నారు. వర్చువల్ పద్ధతిలో సదస్సు జరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఎస్సీవోలో పూర్తి స్థాయి సభ్య దేశం హోదా సంపాదించాక భారత్ ఈ సదస్సులో పాల్గొనడం ఇది నాలుగోసారి. ‘ఎస్సీవో 20వ వార్షికోత్సవం సందర్భంగా గత రెండు దశాబ్దాల్లో సాధించిన ప్రగతిపై సమీక్ష జరిగే అవకాశముంది. భవిష్యత్తులో దేశాల సహకారంపైనా చర్చ జరగొచ్చు’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరాన్, తజకిస్తాన్, ముఖ్య దేశాల విదేశాంగ మంత్రులతో జై శంకర్ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. చైనా, రష్యా, పాక్ విదేశాంగ మంత్రులు సదస్సుకు హాజరుకానున్నారు. నాటో తరహాలో ఎనిమిది దేశాల కూటమిగా ఎస్సీవో ఆవిర్భవించింది. 2017 నుంచి భారత్, పాక్‌లు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షులు సంయుక్తంగా 2001లో షాంఘైలో ఎస్సీవోను స్థాపించారు. భద్రతాపరమైన అంతర్జాతీయ సహకారం కోసం ఎస్సీవోతో, రక్షణ అంశాల్లో ఉమ్మడి పోరు కోసం యాంటీ–టెర్రరిజం స్ట్రక్చర్(ర్యాట్స్)లతో భారత్ కలిసి పనిచేస్తోంది. ఆస్ట్రేలియా ప్రధానితో మోదీ చర్చ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో ప్రధాని మోదీ బుధవారం మాట్లాడారు. భారత్–ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మ భాగస్వామ్యంలో పురోగతిపై నేతలిద్దరూ చర్చించారు. ‘త్వరలో జరగబోయే ‘క్వాడ్’ సదస్సు గురించీ చర్చించాము’ అని ఆ తర్వాత మోదీ ట్వీట్‌చేశారు. -
ఎల్ఏసీని గౌరవించాలి
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ను చైనా గౌరవించాలని, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు మానుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చైనా రక్షణ మంత్రి వెయి ఫెంఘెకు స్పష్టంచేశారు. భారత్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు కట్టుబడి ఉందన్నారు. ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదని చెప్పారు. శుక్రవారం మాస్కోలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు సందర్భంగా వీరిద్దరు రెండు గంటల 20 నిమిషాలపాటు భేటీ అయ్యారు. గత మేలో తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొన్న తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి భేటీ ఇదే కావడం గమనార్హం. ఉభయులు సరిహద్దుతోపాటు, ఇరుదేశాల సంబంధాలపై నిర్మొహమాటంగా, లోతుగా చర్చించుకున్నారని విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. సరిహద్దులో ప్రస్తుత పరిస్థితుల నిర్వహణలో బాధ్యతాయుతంగా మెలగాలని, అలజడి రేగేలా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉభయపక్షాలు నడుచుకోవాలని రాజ్‌నాథ్ చెప్పారు. ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాలు పెద్ద ఎత్తున కవ్వింపు చర్యలకు దిగి ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించాయని రాజ్‌నాథ్.. ఫెంఘె దృష్టికి తీసుకెళ్లారు. ఉభయ దేశాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలను కొనసాగించాలని, వీలైనంత త్వరగా బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. శాంతిని పునరుద్ధరించేలా ఇరు దేశాధినేతల ఏకాభిప్రాయం మేరకు నడుచుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని, దీనివల్ల విభేదాలు వివాదాలుగా మారకుండా ఉంటాయన్నారు. ఎల్ఏసీ వెంబడి గల్వాన్ లోయలో గత కొద్ది నెలలుగా చేస్తున్న అభివృద్ధి పనుల గురించి రాజ్‌నాథ్ చర్చల సందర్భంగా సూత్రప్రాయంగా చెప్పారు. సరిహద్దులో భారత బలగాలు వివాదాలకు తావీయకుండా ఎల్లప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా మెలుగుతున్నాయని, అదే సమయంలో భారత సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు. చైనా అడిగిన అన్ని అంశాలకు రాజ్‌నాథ్ బదులిచ్చారని, వారు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. రెచ్చగొట్టే చర్యలొద్దు: చైనా వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చైనా మంత్రి ఫెంఘె రాజ్‌నాథ్‌కు చెప్పారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ద్వైపాక్షిక ఒప్పందాలను కచ్చితంగా అమలు చేయాలని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని పేర్కొన్నట్లు చెప్పింది. ఉద్రిక్త నివారణకు కలిసి పనిచేయాలని, సంబంధాల పురోగతిపై దృష్టి పెట్టాలని ఫెంఘె చెప్పారంది. వివాదానికి కారణం భారతేనని, చైనా భూభాగాన్ని అంగుళం కూడా వదులుకోబోమని ఫెంఘె చెప్పారంటూ చైనా ఒక ప్రకటన విడుదల చేసి తన వక్రబుద్ధి చాటుకుంది. ఉద్రిక్తత నివారణకు సాయం చేస్తా: ట్రంప్ వాషింగ్టన్: భారత్–చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అక్కడి పరిస్థితి ‘చాలా అసహ్యంగా’ ఉందని అభివర్ణించారు. చైనా చాలా దూకుడుగా వ్యవహరిస్తోందని, అవసరమైతే వివాద పరిష్కారానికి సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ట్రంప్ శుక్రవారం వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితిపై భారత్, చైనాలతో మాట్లాడుతున్నానని పునరుద్ఘాటించారు. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
దురాక్రమణ దుస్సాహసం
మాస్కో: పరస్పర విశ్వాసపూరిత వాతావరణం, దురాక్రమణ రహిత విధానం, అంతర్జాతీయ నిబంధనల అమలు, శాంతియుతంగా విభేదాల పరిష్కారం.. తదితర విధానాలను అవలంబించడం ద్వారానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెన్‌ఘీ సమక్షంలోనే రాజ్‌నాథ్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తూర్పు లద్దాఖ్‌లోని భారత్ సరిహద్దుల్లో తరచుగా దురాక్రమణ దుస్సాహసానికి పాల్పడుతున్న చైనాకు పరోక్ష సందేశంగా దీనిని భావిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం జరిగిన ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన దురాక్రమణ విధాన దుష్ఫలితాలను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ఎస్సీఓ సభ్య దేశాలకు గుర్తు చేశారు. ఎస్సీఓలో భారత్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40% ఉంటుంది. సుమారు గత నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో దురాక్రమణలకు ప్రయత్నిస్తూ చైనా భారత్‌ను కవ్విస్తున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా విఫల యత్నం చేసింది. ‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఈ సంవత్సరంతో 75 ఏళ్లు అవుతుంది. శాంతియుత ప్రపంచం లక్ష్యంగా ఐరాస ఏర్పడింది. ఏకపక్ష దురాక్రమణలకు వ్యతిరేకంగా, దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని స్పష్టం చేస్తూ ఐరాస రూపుదిద్దుకుంది’అని రాజ్‌నాథ్ ఎస్సీఓ సమావేశంలో పేర్కొన్నారు. అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సహాయక చర్యలను భారత్ విస్పష్టంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైబర్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎస్సీఓ ‘రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ (ర్యాట్స్)’చేపట్టిన చర్యలను భారత్ ప్రశంసిస్తోందన్నారు. అతివాద, ఉగ్రవాద ప్రచారాన్ని తిప్పికొట్టే దిశగా ఎస్సీఓ తీసుకున్న నిర్ణయాలను భారత్ స్వాగతిస్తోందన్నారు. అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలోని అన్ని దేశాలతో భారత్‌కు సత్సంబంధాలున్నాయన్నారు. శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకోవాలని ఆయా దేశాలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘పీస్ మిషన్’పేరుతో ఉగ్రవాద వ్యతిరేక వార్షిక సదస్సును చేపట్టడంపై రష్యాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ విభేదాలను విస్మరించి ఒక్కటి కావాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. అఫ్గానిస్తాన్ పరిస్థితిపై ఆందోళన అఫ్గానిస్తాన్‌లో అంతర్గత భద్రత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ‘అఫ్గాన్ నియంత్రణలో, అఫ్గాన్ నేతృత్వంలో సాగే సమ్మిళిత శాంతి ప్రక్రియకు భారత్ సహకారం అందించడం కొనసాగిస్తుంది. అఫ్గానిస్తాన్ ప్రజలు, ఆ దేశ ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న కృషికి మద్దతునిస్తుంది’అని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరిలో అఫ్గాన్ తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అనంతరం అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందడుగు మాస్కో: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో మాస్కోలో భారత, చైనా రక్షణ మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. మాస్కోలోని ప్రముఖ హోటల్లో శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌ఘీ సమావేశమయ్యారు. చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, రష్యాలో భారత రాయబారి వెంకటేశ్ వర్మ కూడా ఉన్నారు. ఈ సమావేశాన్ని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఈ సంవత్సరం మేలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత ఇరు దేశాల మధ్య కీలక మంత్రిత్వ స్థాయి ముఖాముఖి చర్చలు జరగడం ఇదే ప్రథమం. గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఫోన్లో చర్చించారు. కానీ, వారిద్దరి మధ్య ముఖాముఖీ భేటీ జరగలేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్, వీ ఫెన్‌ఘీ రష్యాకు వెళ్లిన విషయం తెలిసిందే. చైనా అభ్యర్థన మేరకే రెండు దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
ఆ దేశాలే బాధ్యులు
బిష్కెక్: షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలపై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న, ఆర్థిక సహాయం చేస్తున్న దేశాలను తప్పనిసరిగా బాధ్యుల్ని చేయాలని శుక్రవారం ఇక్కడ జరిగిన సదస్సులో మోదీ ఎస్సీవో నేతలకు స్పష్టం చేశారు.ఆహుతుల్లో ఉన్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా మోదీ ఈ వ్యాఖ్య చేశారు.ఉగ్రవాదాన్ని అరికట్టే విషయమై అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంతో ఎస్సీవో ప్రదర్శిస్తున్న స్ఫూర్తిని మోదీ కొనియాడారు. ఉగ్రవాద రహిత సమాజం కావాలన్నదే భారత్ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరుకు దేశాలన్నీ సంకుచితత్వాన్ని విడనాడి ఐక్యంగా ముందుకు రావాలన్నారు.ఈ సందర్భంగా ఆయన ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రస్తావించారు.‘గత ఆదివారం నేను శ్రీలంక వెళ్లినప్పుడు సెయింట్ ఆంథోనీ చర్చిని చూశాను.ఉగ్రవాదం వికృత ముఖం నాకక్కడ కనిపించింది’అని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహని తదితరులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను తప్పకుండా జవాబుదారుల్ని చేయాలని మోదీ ఉద్ఘాటించారు. ఎస్సీవో ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక విధానం(ర్యాట్స్)కింద ఉగ్రవాదంపై పోరుకు సహకరించాలని ఆయన ఎస్సీవో నేతలను కోరారు.సాహిత్యం ,సంస్కృతి మన సమాజాలకు సానుకూల దృక్ఫధాన్ని అందించాయని, సమాజంలో యువత చెడుమార్గం పట్టకుండా ఇవి నిరోధించాయని మోదీ అన్నారు. ఎస్సీవో సుస్థిరత, భద్రతలకు శాంతియుతమైన, ప్రగతిశీలమైన, భద్రతాయుతమైన ఆఫ్ఘనిస్తాన్ కీలకమని భారత ప్రధాని అన్నారు. ఆప్ఘన్ శాంతి ప్రక్రియకు మద్దతివ్వడమే మన లక్ష్యమన్నారు. భారత దేశం ఎస్‌సివోలో సభ్యురాలై రెండేళ్లు అయిందని,ఈ రెండేళ్లలో ఆ సంస్థ చేపట్టిన కార్యక్రమాల్లో సానుకూల సహకారం అందించామని మోదీ అన్నారు. చైనా నాయకత్వంలో ఎనిమిది దేశాలతో ఎస్సీవో ఏర్పాటయింది.2017లో భారత, పాకిస్తాన్లకు దీనిలో సభ్యత్వం లభించింది. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ మద్దతిస్తోందని భారత్ ఆరోపిస్తోంది.2016లో పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. పాక్ కేంద్రంగా గల ఉగ్రవాదులే ఈ దాడి చేశారని ఆరోపించిన భారత్, పాకిస్తాన్‌తో సంబంధాలను తెంచుకుంది. మరోవైపు, బిష్కెక్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు. మోదీ–ఇమ్రాన్ పలకరింపులు ఎస్సీవో సదస్సు సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేర్వేరు దేశాధినేతలు ఉన్న లాంజ్‌లో శుక్రవారం ప్రధాని మోదీ, పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలసుకున్నారు. భారత సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి ఈ సందర్భంగా ఇమ్రాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు మోదీ ధన్యవాదాలు చెప్పారు. మోదీ–ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య ఎస్సీవో సదస్సు సందర్భంగా భేటీ ఉండదని విదేశాంగశాఖ గతంలోనే స్పష్టం చేసింది. దౌత్య మర్యాదకు ఇమ్రాన్ భంగం షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సదస్సులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దౌత్య మర్యాదలను పాటించకుండా దేశాన్ని అపఖ్యాతి పాలు చేశారు.సదస్సు ప్రారంభ సమావేశానికి ఎస్సీవో అధినేతలందరూ వస్తుండగా అప్పటికే హాజరయిన దేశాధినేతలంతా మర్యాద పూర్వకంగా లేచి నిలబడితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం కూర్చునే ఉన్నారు.మోదీ సహా వివిధ దేశాధినేతలు నిలబడి ఉండగా, పాకిస్తాన్ ప్రధాని కూర్చుని ఉన్న వీడియో వైరల్ అయింది.ఇమ్రాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధికార ట్విట్టర్లో కూడా ఈ వీడియో వచ్చింది.సమావేశంలో నేతలందరినీ పరిచయం చేస్తున్నసమయంతో తన పేరు ప్రకటించగానే లేచి నిలబడిన ఇమ్రాన్ ఖాన్ వెంటనే కూర్చుండిపోయారు.ఇమ్రాన్ తీరుపై నెటిజన్లు రకరకాల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
పాక్ మీదుగా వెళ్లను
న్యూఢిల్లీ/బీజింగ్: కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో ఈ నెల 13–14 తేదీల్లో జరిగే షాంఘై సహకార సదస్సు (ఎస్సీవో)కు పాకిస్తాన్ గగనతలం మీదుగా వెళ్లరాదని ప్రధాని మోదీ నిర్ణయించుకున్నారు. తమ గగనతలం మీదుగా మోదీ విమానం వెళ్లేందుకు పాక్ అంగీకరించినప్పటికీ కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఒమన్, ఇతర మధ్య ఆసియా దేశాల మీదుగా మోదీ విమానం కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్కు చేరుకుంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‡ తెలిపారు. ఈ ప్రయాణానికి సంబంధించి రెండు రూట్లను భారత ప్రభుత్వం ఖరారుచేసిందన్నారు. కాగా, భారత ప్రధాని మోదీ విమానంలో ఎస్సీవో సదస్సుకు తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు ప్రత్యేకంగా అనుమతిస్తామని పాక్ విమానయానశాఖ మంత్రి సర్వార్‌ఖాన్ చెప్పారు. మోదీ ప్రయాణించే ఎయిరిండియా బోయింగ్ 747–400 విమానం ఢిల్లీ నుంచి బిష్కెక్కు వెళ్లి తిరిగివచ్చేందుకు వీలుగా 72 గంటలపాటు పాక్ గగనతలంలో రాకపోకల్ని అనుమతిస్తామని పేర్కొన్నారు. ఎస్సీవోలో చైనా, భారత్, పాక్, కిర్గిజిస్తాన్ సహా 8 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. మరోవైపు షాంఘై సహకార సదస్సుకు హాజరయ్యేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బయలుదేరినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా జిన్‌పింగ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారని వెల్లడించింది. ఎస్సీవో సదస్సు సందర్భంగా జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో పాటు భారత్‌పై కూడా వాణిజ్య యుద్ధం మొదలుపెట్టిన నేపథ్యంలో అమెరికాను కలసికట్టుగా ఎదుర్కోవడంపై జిన్‌పింగ్, మోదీ చర్చించే అవకాశముందని ప్రభుత్వవర్గాలు చెప్పాయి. ఎస్సీవోతో పటిష్ట సంబంధాలు: మోదీ బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో)లో అంతర్జాతీయ భద్రత, ఆర్థిక సహకారమే ప్రధాన అజెండాగా ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తన బిష్కెక్ పర్యటన ద్వారా ఎస్సీవో దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడతాయని ధీమా వ్యక్తం చేశారు. భారత రాయబారిగా వీడాంగ్ భారత్‌తో సత్సంబంధాలను పెంపొందించుకునే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ దౌత్యవేత్త సున్ వీడాంగ్ భారత్‌లో తమ కొత్త రాయబారిగా నియమించింది. విదేశాంగ మంత్రి జైశంకర్ 2009–13 మధ్యకాలంలో చైనాలో భారత రాయబారిగా పనిచేసిన కాలంలో వీడాంగ్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగశాఖ పాలసీ–ప్రణాళికా విభాగంలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న వీడాంగ్‌ను భారత్‌లో తమ రాయబారిగా నియమించింది. భారత్‌లో చైనా రాయబారిగా ఉన్న లో జుహుయీనిని విదేశాంగశాఖ సహాయమంత్రిగా నియమించింది. -
జిన్‌పింగ్‌తో సై.. ఇమ్రాన్‌కు నై
బీజింగ్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల భేటీకి మరోసారి ము హూర్తం ఖరారైంది. కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్లో జూన్ 12–14 మధ్య జరిగే షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా వీరిద్దరూ సమావేశమవుతారని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రి తెలిపారు. షాన్డాంగ్ ప్రావిన్సులో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మిస్రి మాట్లాడుతూ..‘ఇటీవలికాలంలో భారత్, చైనాలు సుస్థిరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంలో సఫలమయ్యాయి. గతేడాది మోదీ, షీ జిన్‌పింగ్‌లు నాలుగుసార్లు సమావేశమయ్యారు. వుహాన్‌లో 2018లో జరిగిన చరిత్రాత్మక భేటీతో ఇరుదేశాల మధ్య సంబంధాలు సరికొత్త ఎత్తుకు చేరుకున్నాయి. భారత్–చైనాల మధ్య గతేడాది ద్వైపాక్షిక వాణిజ్యం రూ.6.57 లక్షల కోట్ల(95 బిలియన్ డాలర్లు)కు నమోదుకాగా, ఈ ఏడాది రూ.6.92 లక్షల కోట్ల(100 బిలియన్ డాలర్లు)కు చేరుకోనుంది’ అని పేర్కొన్నారు. ఇమ్రాన్‌తో భేటీకి నో.. షాంఘై సదస్సు సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో మోదీ సమావేశం కాబోరని భారత విదేశాంగ శాఖ తెలిపింది. పాక్ విదేశాంగ కార్యదర్శి సోహైల్ మహమూద్ ఇటీవల భారత్‌లో ప్రైవేటుగా పర్యటించిన నేపథ్యంలో మోదీ–ఇమ్రాన్ సమావేశమవుతారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కుమార్ స్పందిస్తూ.. ‘ఇమ్రాన్, మోదీల మధ్య ఎలాంటి భేటీ ఖరారు కాలేదు. పాక్ కార్యదర్శి సోహైల్ తన వ్యక్తిగత హోదాలో మూడ్రోజుల భారత పర్యటనకు వచ్చారు. ఆయన పర్యటనకు, ఇరుదేశాల ప్రధానుల మధ్య భేటీకి ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, ప్రతీకారంగా భారత్ చేసిన వైమానిక దాడులతో పాక్–ఇండియాల మధ్య సంబంధాలు తీవ్రంగా దిగజారిన సంగతి తెలిసిందే. ఇటీవల రెండోసారి ప్రధానిగా మోదీ ఎన్నికైన అనంతరం ఫోన్‌చేసిన ఇమ్రాన్‌ఖాన్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. -
రెండు సదస్సులు భిన్న దృశ్యాలు
వర్తమాన ప్రపంచ పరిస్థితులకు అద్దం పట్టే రెండు చిత్రాలు మీడియాలో సోమవారం ప్రముఖంగా దర్శనమిచ్చాయి. అందులో ఒకటి చైనాలోని చింగ్దావ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించిందైతే...రెండోది కెనడాలోని క్యుబెక్‌లో జరిగిన జీ–7 దేశాల అధినేతల సమావేశ దృశ్యం. ఎస్సీఓ సదస్సులో నేతలందరూ వాణిజ్యం, భద్రత రంగాల్లో సమష్టిగా కలిసి పనిచేసి అభివృద్ధి సాధించాలని నిర్ణయించుకోగా...జీ–7లో నేతలు పరస్పర ఆరోపణలతో పొద్దుపుచ్చారు. జీ–7 సదస్సు ముగిశాక కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దేశాధినేతలమధ్య అవగాహన కుదిరిందంటూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేయగా అది నిజం కాదని, దాన్ని తాము ఖండిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించి సదస్సు పరువు తీశారు. అయితే ఎస్సీఓ సదస్సులోనూ విభేదాలు రాకపోలేదు. చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ)కు భారత్ మినహా ఎస్సీఓ దేశాలన్నీ మద్దతు ప్రకటించాయని సదస్సు ముగింపు తర్వాత విడుదలైన ప్రకటన తెలిపింది. రెండు సదస్సుల తీరు తెన్నులనూ గమనిస్తే మనం ఎంత మెలకువతో వ్యవహరించాలో అర్ధమవుతుంది. ఎస్సీఓ యూరేసియా దేశాల కోసం చైనా చొరవతో ఏర్పాటైన సంస్థ. అందులో రష్యాతోపాటు మన దేశం, పాకిస్తాన్, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్ సభ్య దేశాలుగా ఉంటే ఇరాన్, అఫ్ఘానిస్తాన్ వంటివి పరిశీలక హోదాలో పాల్గొంటున్నాయి. బీఆర్ఐపై భిన్నాభిప్రాయం మినహా ఆ సదస్సులో చర్చించిన ఇతర అంశాలపై మన దేశానికి ఏకీభావం ఉంది. ఎస్సీఓలో మన దేశానికి పూర్తి స్థాయి సభ్యత్వం రావడం ఇదే ప్రథమం. మనతోపాటు పాకిస్తాన్‌కు కూడా ఇందులో చోటు దక్కింది. చైనా చొరవతో రూపుదిద్దుకున్న బీఆర్ఐ ఒక బృహత్తరమైన ప్రాజెక్టు. అమెరికాతో పాటు అగ్ర రాజ్యాలన్నీ స్వీయ మార్కెట్ల రక్షణ కోసం మార్గాలు వెదుక్కుంటున్న వేళ ఆసియా, యూరప్, ఆఫ్రికా దేశాల వాణిజ్యాన్ని అనుసంధానించే బీఆర్ఐ నిస్సందేహంగా బహుళవిధ ప్రయో జనకరమైనదే. ప్రాచీన కాలంలోని సిల్క్ రోడ్‌ను తలపించేలా ఖండాంతరాల్లోని దాదాపు 80 దేశా లను అనుసంధానించే ఈ ప్రాజెక్టు ప్రపంచ జనాభాలో 64శాతం మంది అంటే 450 కోట్ల ప్రజా నీకాన్ని ఏకం చేస్తుంది. ఈ దేశాలన్నిటి మధ్యా వాణిజ్యం అత్యంత సులభమై అన్ని దేశాలూ సంప న్నవంతం కావడానికిది దోహదపడుతుంది. ఆగ్నేయాసియా, యూరప్, ఆఫ్రికా దేశాలతో నేరుగా వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడానికి, మన మార్కెట్‌ను ఇప్పటికన్నా ఎన్నో రెట్లు విస్తరించు కోవడానికి బీఆర్ఐ నిస్సందేహంగా ఉపయోగపడుతుంది. అయితే మన దేశానికున్న ప్రధాన అభ్యంతరమల్లా అలాంటి ప్రాజెక్టు దేశాల సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతలను గుర్తించి గౌరవించాలన్నదే. ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్న చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని గిల్గిత్–బాల్టిస్తాన్‌ల మీదుగా వెళ్తోంది. సారాంశంలో బీఆర్ఐ ప్రాజెక్టును మన దేశం అంగీకరించడమంటే పాక్ దురాక్రమణకు ఆమోదం తెలపడమే, సాధికారత కల్పించడమే అవుతుంది. అగ్రరాజ్యాల మధ్య విభేదాలు ముదురుతూ జీ–7 దేశాల శిఖరాగ్ర సద స్సుల వంటివి కూడా విఫలమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక చోదక శక్తిగా ఎదగా లని చైనా తహతహలాడుతోంది. పలుకుబడిని విస్తరించుకోవాలని ఆశిస్తోంది. అటువంటప్పుడు దాదాపు 130 కోట్ల జనాభాతో ఆసియాలో తన పొరుగునే అతి పెద్ద మార్కెట్‌గా రూపుదిద్దుకున్న భారత్ మనోభావాలను విస్మరించడం చైనాకు తగని పని. తన సార్వభౌమత్వాన్ని సవాలు చేసే విధంగా ఏర్పాటైన ప్రాజెక్టులో ఏ దేశమైనా ఎలా పాలుపంచుకోగలదో చైనా ఆలోచించాలి. నిజానికి దాదాపు రెండేళ్లనుంచి ఈ విషయంలో మన దేశం అభ్యంతరం చెబుతూ వస్తోంది. ఎస్సీఓలో భారత్, పాకి స్తాన్లు రెండూ చేరడంతో సంస్థ బలోపేతమైందని చెప్పిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్... సభ్య దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని విడనాడాలని, ఇతర సభ్య దేశాల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలని సూచించారు. మంచిదే. కానీ బీఆర్ఐలో ఉన్న లోపాల మాటేమిటి? తన ప్రయోజనాలకు భిన్నంగా ఉన్న ఇండో–పసిఫిక్ ప్రాంత కూటమిలో మన దేశం పాలు పంచుకుంటున్నదన్న దుగ్ధ చైనాకు ఉంది. భారత్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికాల భాగ స్వామ్యంతో ఏర్పాటయ్యే ఆ ‘చతుర్భుజ కూటమి’ ఇంకా శైశవ దశలోనే ఉంది. నాలుగు దేశాల మధ్యా చర్చలు సాగుతున్నా చివరిలో వేర్వేరు ప్రకటనలు వెలువడుతున్నాయి తప్ప ఉమ్మడి ప్రకటనల దశ ఇంకా మొదలు కాలేదు. ఇండో–పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా ఉండాలని, అన్ని దేశాల అభివృద్ధికీ దోహదపడేలా ఉండాలని స్థూలంగా ఆ కూటమి భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని కొన్ని దీవులు తమవేనంటూ సొంతం చేసుకున్న చైనా తీరును మిగిలిన మూడు దేశాలూ పరోక్షంగా తప్పుబడుతున్నాయి. అక్కడి సముద్ర జలాల్లో స్వేచ్ఛా సంచారానికి వీలుం డాలని, అంతర్జాతీయ నిబంధనలు వర్తించాలని ఆ దేశాలు అంటున్నా మన దేశం ప్రకటనలు ఇంత వరకూ వాటి జోలికి పోలేదు. అయినా మనపై చైనా గుర్రుగా ఉంది. అందుకే కావొచ్చు... బీఆర్ఐ విషయంలో మన వాదనను విస్మరిస్తోంది. జీ–7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగిన తీరు, అక్కడ భారత్ ప్రస్తావన తెచ్చి విమర్శించిన ట్రంప్ వైఖరి గమనించాక మన విదేశాంగ విధానం మరింత పదునుదేరాలని అర్ధమవుతుంది. అయిదు వారాల క్రితం అనధికార శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీ, జిన్‌పింగ్‌లు ఇప్పుడు ఎస్సీఓ సదస్సు సందర్భంగా కూడా కలుసుకున్నారు. మరో అన ధికార శిఖరాగ్ర సదస్సు కోసం వచ్చే ఏడాది మన దేశం వస్తానని జిన్‌పింగ్ చెప్పారు. ఈ పరిణా మాలు ఎంతో ఆశావహమైనవి. ఇవి అపోహలనూ, విభేదాలనూ పటాపంచలు చేసి రెండు దేశాల మధ్యా మరింత సాన్నిహిత్యానికి దోహదపడాలని ఆశిద్దాం. -
బీఆర్ఐకి వ్యతిరేకం
చింగ్‌దావ్: చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) తమకు ఆమోదయోగ్యం కాదని భారత్ తేల్చిచెప్పింది. చైనాలోని చింగ్దావ్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సమావేశం వేదికగా బీఆర్ఐపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తన నిర్ణయాన్ని మరోసారి కుండబద్దలు కొట్టారు. ఏ భారీ ప్రాజెక్టు అయినా.. ఈ కూటమి సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే.. మధ్య ఆసియా దేశాలతో స్నేహాన్ని పెంపొందించుకోవడంతోపాటు ఎస్సీవో చేపట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ప్రభావానికి అతి దురదృష్టకర ఉదాహరణగా అఫ్గాన్ నిలిచిందని.. అక్కడ శాంతి నెలకొల్పడంలో భారత్ కీలకంగా వ్యవహరిస్తుందని ప్రధాని తెలిపారు. అనంతరం ఎస్సీవో డిక్లరేషన్‌పై భారత్, రష్యా, పాకిస్తాన్, చైనా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్ దేశాలు సంతకం చేశాయి. భారత్ మినహా మిగిలిన దేశాలన్నీ బీఆర్ఐకి అంగీకారం తెలిపాయి. సదస్సు సందర్భంగా భారత్ ప్రధాని, పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ పరస్పరం కరచాలనం చేసుకుని, పలకరించుకున్నారు. అయితే వీరి మధ్య చర్చలేమీ జరగలేదు. రెండ్రోజుల ఎస్సీవో సదస్సు ముగిసిన అనంతరం మోదీ భారత్ బయల్దేరారు. అనుసంధానతే మా లక్ష్యం.. కానీ! ఆదివారం సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. బీఆర్ఐని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘ఏ మెగా ప్రాజెక్టు అయినా సభ్యదేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాల్సిందే. ఇతర దేశాలతో అనుసంధానత పెంచుకోవడమే మా ప్రాధాన్యత. అయితే అందరినీ కలుపుకుపోయే ప్రాజెక్టులను మేం సంపూర్ణంగా స్వాగతిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ నార్త్–సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ (ఐఎన్ఎస్టీసీ – 7,200 కి.మీ. పాటు వివిధ రకాల రవాణా మార్గాలతో నిర్మించే ఈ ప్రాజెక్టు భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌లను కలపనుంది)లో భాగస్వామ్యం, ఇరాన్‌లోని ఛబహర్ పోర్టు అభివృద్ధి, అష్గాబట్ (వివిధ రవాణా మార్గాల ఏర్పాటుకు భారత్, ఇరాన్, కజకిస్తాన్, ఒమన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య కుదిరింది) ఒప్పందం తదితర ప్రాజెక్టుల్లో భారత్ చురుకైన పాత్ర పోషించడమే అనుసంధానతపై తమ విధానాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఉగ్రవాదంపై సమైక్యపోరు: ఉగ్రవాదంపై అన్ని దేశాలు ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. అఫ్గానిస్తాన్ ఉగ్రవాదానికి బలైపోయి దురదృష్టకర ఉదాహరణగా నిలిచిందన్నారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశాధ్యక్షుడు ఘనీ చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు. ప్రచ్ఛన్న యుద్ధ ఆలోచనలు మనకొద్దు: జిన్‌పింగ్ ఎస్సీవోలోకి భారత్, పాక్‌లు శాశ్వత సభ్యదేశాలుగా చేరడంతో ఈ కూటమి బలం పెరిగిందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. బీఆర్ఐ గురించి ప్రస్తావిస్తూ.. ‘అన్ని దేశాలూ ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని మెరుగుపరుచుకునేందుకు పరస్పర సహకారం అనే నినాదంతో పనిచేయాలి. బీఆర్ఐ సహకారాన్ని, మన అభివృద్ధి వ్యూహాలను పెంచుకోవాలి’ అని పేర్కొన్నారు. ‘ఎస్సీవో ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. సరికొత్త సహకారం అందనుంది. అయితే మనం ప్రచ్ఛన్నయుద్ధ ఆలోచనలను తిరస్కరించాలి. సభ్యదేశాల మధ్య ఘర్షణాత్మక వాతావరణాన్ని, తమ భద్రతకోసం ఇతరుల భద్రతకు విఘాతం కలిగించే చర్యలను మానుకోవాలి. దీర్ఘదృష్టి లేకుండా తీసుకునే నిర్ణయాలను (పరోక్షంగా అమెరికాను ప్రస్తావిస్తూ) మనం సమర్థించకూడదు’ అని జిన్‌పింగ్ అన్నారు. బీఆర్ఐ ఏంటి? ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, గల్ఫ్ దేశాలు, ఆఫ్రికా, యూరప్‌లలోని రోడ్డు, సముద్రమార్గాలను కలుపుతూ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)ని నిర్మించనున్నట్లు చైనా 2013లో ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే దాదాపు రూ.8.5 లక్షల కోట్లు విడుదల చేసినట్లు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు అంగీకరిస్తూ 80 దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు, ఇప్పటికే బీజింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని చైనా వెల్లడించింది. అయితే పలు దేశాలకు ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నాయి. అంతర్జాతీయంగా చైనా ప్రభావాన్ని పెంచుకునేందుకే ఈ ప్రాజెక్టును ప్రారంభించారని ఆ దేశాలు భావిస్తున్నాయి. అయితే.. బీఆర్ఐలో చైనా–పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ) భాగంగా ఉంది. ఈ సీపీఈసీ కోసం చైనా రూ.3.4 లక్షలకోట్లు వెచ్చించనుంది. ఈ ప్రాజెక్టు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ గుండా వెళ్తోంది. వివాదాస్పదమైన ఈ ప్రాంతంలో చైనా ప్రాజెక్టును చేపట్టడం తమ సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడమేనని భారత్ భావిస్తోంది. -
మహిళల నేతృత్వంలో అభివృద్ధి
సాక్షి, బెంగళూరు: దేశం మహిళాభివృద్ధి నుంచి మహిళల నాయకత్వంలో అభివృద్ధి (ఉమెన్ డెవలప్మెంట్ టు ఉమెన్–లెడ్ డెవలప్మెంట్) దిశగా అడుగులేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘మహిళలే ముందు’ అనేది తమ ప్రభుత్వ, పార్టీ విధానమనీ, ఇదే తమ మంత్రమని ఆయన శుక్రవారం పేర్కొన్నారు. ఈ నెల 12న కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలతో నరేంద్ర మోదీ యాప్ ద్వారా ప్రధాని సంభాషించారు. ‘బీజేపీలో మహిళా శక్తి కీలకం. పార్టీ అయినా, ప్రభుత్వమైనా, కార్యక్రమాల రూపకల్పనైనా.. మాకు మహిళలే ముందు’ అని మోదీ పేర్కొన్నారు. ఇటీవలి షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్యదేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రుల సదస్సుల్లో పాల్గొన్న మహిళలు ఇద్దరేననీ, వారిద్దరూ తమ మంత్రివర్గంలోని వారేనని మోదీ వ్యాఖ్యానించారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం రాజ్యసభలో కర్ణాటకకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 1999 లోక్‌సభ ఎన్నికలప్పుడు బళ్లారి నుంచి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై పోటీచేసి ఓడిపోయారని మోదీ గుర్తుచేశారు. ఈ విధంగా ఎస్సీవో సదస్సులో పాల్గొన్న ఇద్దరు మంత్రులకు కర్ణాటకతో సంబంధం ఉందన్నారు. బూత్ స్థాయిలోనూ గెలవాలి.. ‘మనం రాష్ట్రంలో గెలవాలి. గెలుస్తాం. నియోజకవర్గాల్లో గెలవాలి. అదీ గెలుస్తాం. కానీ పోలింగ్ బూత్ స్థాయిలోనూ గెలిచేందుకు కృషి చేయాలని నేను కార్యకర్తలను కోరుతున్నాను’ అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పనులు, తీసుకొచ్చిన వివిధ పథకాలపై కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందంటూ మహిళల కోసం తాము తీసుకొచ్చిన వివిధ పథకాలను ఆయన ప్రస్తావించారు. మంచి కుటుంబ విలువలు, సంస్కృతితో పిల్లలను పెంచడంతోపాటు పోలీసులు బాగా పనిచేసి, దోషులకు సత్వర శిక్షలు పడేలా చేస్తే మహిళలపై దురాగతాలు ఆగుతాయని అన్నారు. నేరస్తుల్లో భయం పుట్టించడం కోసం తమ ప్రభుత్వం ఐపీసీ, సీఆర్పీసీతోపాటు పోక్సో చట్టంలో పలు సవరణలు చేసిందని మోదీ తెలిపారు. ఒలింపిక్స్‌లో అయినా కామన్వెల్త్ గేమ్స్‌లో అయినా దేశం గర్వపడేలా చేసింది క్రీడాకారిణులేననీ, సామాజిక, ఆర్థిక రంగాలు సహా అనేక విభాగాల్లో మహిళలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. -
దశాబ్ధాల తర్వాత దాయాదులు తొలిసారిగా..
బీజింగ్ : 1947లో వేర్వేరు దేశాలుగా అవతరించిన తర్వాత భారత్, పాకిస్తాన్‌లు తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి. సెప్టెంబర్‌లో రష్యాలో జరగనున్న శాంతి ప్రక్రియ కసరత్తులో భాగంగా ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ)లో ఇతర సభ్య దేశాలతో కలిసి భారత్, పాక్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. బీజింగ్‌లో 15వ ఎస్సీఓ రక్షణ మంత్రుల సదస్సులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పీస్ మిషన్ 2018లో భారత్ పాల్గొంటుందని ప్రకటించారు. అణు సామర్ధ్యం కలిగిన దక్షిణాసియా దేశాలు ఈ తరహా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రష్యా, చైనా సహా ఎస్సీఓ సభ్య దేశాలన్నీ ఈ విన్యాసాల్లో పాల్గొంటాయి. ఎస్సీఓలో గత ఏడాది భారత్, పాకిస్తాన్‌లు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని స్వీకరించాయి. గతంలో ఆఫ్రికా దేశాల్లో జరిగిన పలు ఐరాస శాంతి మిషన్స్‌లో భాగంగా భారత్, పాక్ సైనికులు కలిసి పనిచేసినా సంయుక్త సైనిక విన్యాసాల్లో పాల్గొనడంమాత్రం ఇదే తొలిసారి. రక్షణ రంగంలో దక్షిణాసియా ప్రాంత దేశాలతో పరస్పర ద్వైపాక్షిక సహకారానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మరోవైపు సైనిక విన్యాసాల్లో పాకిస్తాన్ పాల్గొంటుందని పాక్ అధికారులు ధృవీకరించారు. -
జూన్‌లో భారత్–పాక్ ప్రధానుల భేటీ!
ఇస్లామాబాద్: ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్–పాకిస్తాన్ ప్రధానులు త్వరలో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు పాక్ మీడియా తెలిపింది. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జూన్‌లో జరుగనున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సమావేశాల్లో భారత ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో చర్చలకు అవకాశం ఉన్నట్లు దౌత్య వర్గాలను ఊటంకిస్తూ పాక్‌కు చెందిన ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక పేర్కొంది. భారత్–పాక్‌ల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలని మిగతా ఎస్సీఓ సభ్యులు ఒత్తిడి తెస్తున్నట్లు ట్రిబ్యూన్ వెల్లడించింది. -
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ భేటీ
తాష్కెంట్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం చైనా అధ్యక్షుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. రెండురోజుల పాటు జరుగనున్న ఎస్సీవో సమ్మిట్ (షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్)లో పాల్గొనేందుకు ఆయన ఇవాళ తాష్కెంట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ...చైనా అధ్యక్షుడితో సమావేశం అయ్యారు. అంతకు ముందు ఉజ్బెకిస్థాన్ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ ట్విట్ చేశారు. 'స్నేహపూరిత దేశానికి మరోసారి రావటం సంతోషకరం. ఎస్సీవో సమ్మిట్‌లో పలువురు నేతలతో సమావేశం అవుతాను' అని మోదీ ట్విట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉజ్బెకిస్థాన్ ప్రధాని షౌకత్ మీర్జియోయెవ్తో కలిసి దిగిన ఫోటోను మోదీ పోస్ట్ చేశారు. ఈ సమ్మిట్‌లో భారత్‌తో పాటు పాకిస్థాన్, చైనా, రష్యా,కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. దేశాల మధ్య శాంతి భద్రతల అంశంలో పరస్పర సహకారం, తీవ్రవాదం అణచివేత, రక్షణ రంగానికి సంబంధించిన చర్యలపై సమ్మిట్‌లో కీలక చర్చలు జరుపనున్నారు. మరోవైపు ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో కూడా భేటీ కానున్నారు. న్యూక్లియార్ సప్లై గ్రూప్ దేశాల సమావేశం కూడా రేపటి నుంచే సియోల్‌లో ప్రారంభం అవుతుండటంతో మోదీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం అమెరికాతో పాటు రష్యా తదితర దేశాలు మద్దతిస్తున్నా చైనా వ్యతిరేకిస్తోందనే వార్తలు వస్తుండటంతో మోదీ పర్యటన కీలకం కానుంది.