
న్యూఢిల్లీ: కజకిస్తాన్‌లో వచ్చే నెలలో జరగనున్న షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు (ఎస్‌సీవో)కు ప్రధాని మోదీ హాజరవడం లేదు. ఈ సదస్సుకు ప్రధాని స్థానంలో విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ వెళ్లనున్నారు.
జులై 3-4 తేదీల్లో జరగనున్న షాంఘై సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారని తొలుత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా ఆయన వెళ్లడం లేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం(జూన్28) మీడియా సమావేశంలో చెప్పారు. గత ఏడాది ఎస్‌సీవో సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వగా చైనా, రష్యా ప్రధానులు రాలేమని చెప్పడంతో వర్చువల్‌గా సదస్సును నిర్వహించారు.