
చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల టియాంజిన్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం మోదీ కోసం ఆ దేశంలోని ప్రతిష్టాత్మక వాహనంగా ఉన్న ‘హాంగ్కీ ఎల్ 5’ను ఏర్పాటు చేసింది. దీనికి చైనాలో అత్యంత ప్రముఖమైన, ప్రభుత్వ లగ్జరీ కారుగా గుర్తింపు ఉంది.
హాంగ్కీ ఎల్ 5 ప్రత్యేకతలు
హాంగ్కీ అంటే మాండరిన్ భాషలో ‘రెడ్ ఫ్లాగ్’ అని అర్థం.
ఇది చైనా పురాతన ప్యాసింజర్ కార్ బ్రాండ్. దీన్ని 1958లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్ఎడబ్ల్యు) ప్రారంభించింది.
ఎల్ 5 మోడల్‌ను చైనా అగ్రనేతల కోసం, ఎంపిక చేసిన విదేశీ ప్రముఖుల కోసం రిజర్వ్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు ప్రయానించే ‘బీస్ట్’కు ఆ దేశంలో ఎంత గుర్తింపు ఉంటుందో.. చైనాలో ‘హాంగ్కీ ఎల్ 5’కు అంత గుర్తింపు ఉంటుంది.
5.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారు బరువు 3 టన్నుల కంటే ఎక్కువే. దీని విలువ సుమారు రూ.7 కోట్లు (సుమారు 8 లక్షల డాలర్లు)గా ఉంటుందని అంచనా. ఇందులో లెదర్, హ్యాండ్‌క్రాఫ్ట్ కలపతో ఇంటీరియర్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖులు సంభాషణకు సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: వారెన్ బఫెట్ పంచ సూత్రాలు..