
జీవితంలో ఎన్నో ఆర్థిక పాఠాలు నేర్చుకొని, తన జీవన శైలితో మరెన్నో పాఠాలు నేర్పిస్తున్న బిజినెస్ టైకూన్ వారెన్ బఫెట్ ఇటీవల 94 ఏళ్లు పూర్తి చేసుకొని 95వ వసంతంలోకి ప్రవేశించారు. ఆయన పలు సందర్భాల్లో చెప్పిన కొన్ని ఆర్థిక సూత్రాలను కింద తెలియజేశాం.
బఫెట్ పంచ సూత్రాలు
పెట్టుబడుల విషయంలో దీర్ఘకాల దృష్టి ఉండాలి. అవసరమైతే ఎప్పటికీ కొనసాగించాలి.
నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. ఇక్కడ పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. మంచి కంపెనీని అద్భుతమైన ధరలో (చాలా ఖరీదైన వ్యాల్యుయేషన్‌లో) కొనడం కంటే.. అద్భుతమైన కంపెనీని సరసమైన ధరలో కొనుక్కోవాలి.
పెట్టుబడుల్లో ఉండే రిస్క్ తెలుసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియనప్పుడే రిస్క్ ఎదురవుతుంది.
వ్యాపారంపై పెట్టుబడి పెడుతున్నారు. అసాధారణ యాజమాన్యం, అద్భుతమైన వ్యాపారంతో ఉంటే ఆ కంపెనీలో మీరు పెట్టే పెట్టుబడి కాల వ్యవధి జీవితకాలంగానే భావించాలి.
ఈక్విటీ మార్కెట్లో ఓపిక ఉన్నవారికే అధిక రాబడులు సొంతమవుతాయి. దూకుడైన ఇన్వెస్టర్ నుంచి ఓపికగా వేచి చూసే ఇన్వెస్టర్‌కు సంపదను బదిలీ చేసే విధంగా స్టాక్ మార్కెట్ పనితీరు ఉంటుంది.
ఇదీ చదవండి: భారత్ మూడంచెల ప్లాన్..