మార్కెట్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వారెన్‌ బఫెట్‌.. | Warren Buffetts Berkshire Hathaway Invests In Alphabet Shift In Investing Strategy, More Details Inside | Sakshi
Sakshi News home page

మార్కెట్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వారెన్‌ బఫెట్‌..

Nov 15 2025 12:02 PM | Updated on Nov 15 2025 1:10 PM

Warren Buffetts Berkshire Hathaway invests in Alphabet shift in investing strategy

లెజండరీ ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ మార్కెట్‌​కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. బఫెట్‌ నేతృత్వంలోని బెర్క్‌షైర్ హాత్వే టెక్ రంగంలో అరుదైన, ధైర్యమైన అడుగు వేసింది. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌లో భారీ పెట్టుబడి పెట్టినట్లు శుక్రవారం ఆలస్యంగా విడుదల చేసిన సెక్యూరిటీల ఫైలింగ్ వెల్లడించింది. దీంతో వాల్ స్ట్రీట్ దృష్టి ఒక్కసారిగా దీనిపై పడింది.

ఎందుకంటే వారెన్ బఫెట్ సాధారణంగా అధిక వేగంతో కదిలే టెక్‌ స్టాక్స్‌ జోలికి వెళ్లరు. కానీ ఈ చర్య బఫెట్‌ అనుసరించే పెట్టుబడి ధోరణిలో గణనీయమైన మార్పును సూచిస్తోంది. కంపెనీ నాయకత్వ బాధ్యతలు బఫెట్‌ చేతులు మారుతున్న క్రమంలో యాపిల్‌లో తమ దీర్ఘకాలిక  హోల్డింగ్స్‌ను బెర్క్‌షైర్ క్రమంగా తగ్గించడం, ఇప్పుడు ఈ కొత్త పెట్టుబడి.. సంస్థ దిశలో వస్తున్న మార్పును సూచిస్తోంది.

ఆల్ఫాబెట్‌లో భారీ పెట్టుబడులు
బెర్క్‌షైర్ హాత్వే ఆల్ఫాబెట్‌లో కొత్తగా 4.3 బిలియన్ డాలర్ల విలువైన హోల్డింగ్‌ను ప్రకటించింది. దీంతో సెప్టెంబర్ చివరి నాటికి అది సంస్థ 10వ అతిపెద్ద ఈక్విటీ స్థానంగా మారింది. వేగంగా పెరుగుతున్న టెక్ కంపెనీలపై బఫెట్ చాలా కాలంగా జాగ్రత్తగా ఉంటున్న నేపథ్యంలో ఈ కొనుగోలు ప్రత్యేక ప్రాధాన్యత పొందుతోంది. అయితే యాపిల్‌లో చాలా ఏళ్లుగా పెట్టుబడులు ఉంటున్నప్పటికీ బఫెట్ దానిని టెక్ కంపెనీ కంటే కూడా వినియోగదారుల ఉత్పత్తుల బ్రాండ్‌గా చూడాలని చెప్పేవారు.

ఇప్పటికే 95 ఏళ్ల వయస్సులో ఉన్న బఫెట్ ఈ సంవత్సరం చివరి నాటికి సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్న నేపథ్యంలో ఈ మార్పులు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గ్రెగ్ అబెల్ నాయకత్వాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతుండగా ‘పోస్ట్-బఫెట్’ యుగంలో బెర్క్‌షైర్ పెట్టుబడి తత్వం ఎలా మారబోతోందోనని మదుపరులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement