
తియాంజిన్: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జపాన్ పర్యటనను ముగించుకుని.. చైనాకు చేరుకున్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సు (SCO)లో పాల్గొనేందుకు ఆయన తియాంజిన్‌లో ల్యాండ్ అయ్యారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో తియాంజిన్ వేదికగా నిర్వహించనున్న ఎస్‌సీవో సదస్సుకు హాజరుకానున్నారు.
ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధినేత పుతిన్ సహా ఆయా దేశాధినేతలతో భేటీ కానున్నారు. ప్రపంచ ఆర్థిక క్రమం(ఆర్డర్)లో స్థిరత్వం తీసుకురావాలంటే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనా తప్పనిసరిగా కలిసి పనిచేయాలన్న ప్రధాని మోదీ.. జపాన్ పత్రిక యోమియురి షిమ్‌బన్‌కు శుక్రవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత్–చైనా సంబంధాల ఆవశ్యకతను మోదీ వివరించారు.

ప్రపంచ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం కోసం ఆసియాలో దిగ్గజ దేశాలైన భారత్, చైనా మధ్య స్నేహ సంబంధాలు బలపడాల్సిందేనని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న టారిఫ్‌ల యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్–చైనాలు ఒక్కటైతే ఇరుదేశాలతోపాటు ప్రపంచ దేశాలకు సైతం మేలు జరుగుతుందని మోదీ చెప్పారు
జపాన్‌లోని మియాగీ ప్రిఫెక్చర్‌లోని సెండాయ్ నగరంలో ప్రధాని మోదీ సెమీకండక్టర్ ప్లాంట్‌ను సందర్శించారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తయారీ, మొబిలిటీ, నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లు వంటి వ్యాపారాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలంటూ ఆయన సూచించారు.

భారత్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా తన జపాన్ పర్యటన కొనసాగిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. 2018లో చైనాలో చివరిసారి ప్రధాని మోదీ పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్‌పై విరుచుకుపడుతున్న వేళ.. ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
#WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he arrives at a hotel in Tianjin, China.
Chants of 'Bharat Mata ki jai' and 'Vande Mataram' raised by members of the Indian diaspora.
(Video: ANI/DD) pic.twitter.com/hiXQYFqm07— ANI (@ANI) August 30, 2025