
తియాన్‌జిన్: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సు ఆదివారం రాత్రి తియాన్‌జిన్‌లో ప్రారంభమయ్యింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విందు కార్యక్రమంతో సదస్సు మొదలయ్యింది. నేడు సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
జిన్‌పింగ్ ఇచ్చిన విందు కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా వివిధ దేశాధినేతలు పాల్గొన్నారు. కూటమి దేశాల మధ్య ఐక్యతను, సహకారాన్ని పెంపొందించి, పురోగమనంలోకి పయనించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. దక్షిణార్థగోళ దేశాల బలాన్ని పెంపొందించేందుకు, మానవ నాగరికత మరింత పురోగమించడానికి వీలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా 20 మంది విదేశీ నేతలను, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులను ఈ సదస్సుకు జిన్‌పింగ్ ఆహ్వానించారు.
సోమవారం వీరంతా కీలక సమావేశంలో పాల్గొననున్నారు. వేదికపై మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైనాతో సంబంధాలపై ఆయన ఈ సదస్సులో మాట్లాడే అవకాశం ఉంది. మోదీ సహా వివిధ దేశాధినేతలు జిన్‌పింగ్‌తో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాగా షాంఘై సహకార సంస్థ సదస్సులో వివిధ దేశాలు అభివృద్ధిపై వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు, భద్రత, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
PM Modi, President Putin and President Xi shared a light moment on the sidelines of the SCO Summit in China. pic.twitter.com/pEpAdF4qYi
— Tar21Operator (@Tar21Operator) September 1, 2025