భారత్ 'మిషన్ దృష్టి' సక్సెస్: మస్క్ ట్వీట్! | Elon Musk Reacts to PM Modi Post on GalaxEye Mission Drishti Launch | Sakshi
Sakshi News home page

భారత్ 'మిషన్ దృష్టి' సక్సెస్: ప్రశంసలు కురిపించిన మస్క్!

May 6 2026 5:42 PM | Updated on May 6 2026 6:23 PM

Elon Musk Reacts to PM Modi Post on GalaxEye Mission Drishti Launch

బెంగళూరుకు చెందిన స్టార్టప్ గెలాక్సీఐ (GalaxEye) రూపొందించిన 'మిషన్ దృష్టి' ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. ఈ విజయంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించగా.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా అభినందనలు తెలిపారు.

కాలిఫోర్నియా నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మిషన్ దృష్టి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే మొదటి 'ఆప్టోసార్' శాటిలైట్‌గా గుర్తింపు పొందింది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ (EO), సింథటిక్ అపర్చర్ రాడార్ (SAR) సాంకేతికతల  కలయికతో రూపొందింది.

EO సిస్టమ్ ద్వారా.. స్పష్టమైన, వాతావరణంలోని హై క్వాలిటీ ఫోటోలను పొందవచ్చు. SAR సాంకేతికత ద్వారా వర్షం, మబ్బులు, రాత్రి వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సమాచారాన్ని సేకరించవచ్చు. ఈ రెండు టెక్నాలజీలు కలిసి ఉండటం వల్ల.. భూమి పరిశీలనలో ఉన్న పరిమితులను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక వసతుల ప్రణాళిక వంటి అనేక రంగాలకు ఉపయోగకరమైన డేటా లభిస్తుంది.

ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ప్రాజెక్ట్‌ను భారత యువత ప్రతిభకు నిదర్శనంగా పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి సాంకేతికత ఎంత ముఖ్యమో ఈ ప్రాజెక్ట్ స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. భారత అంతరిక్ష సంస్థలతో పాటు ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావడం దేశానికి మరింత బలం చేకూరుస్తోంది.

భవిష్యత్తులో.. గెలాక్స్ఐ సంస్థ ఈ వ్యవస్థను మరింత విస్తరించి 2030 నాటికి 10 ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా భారతదేశం స్వంతంగా బలమైన భూ పరిశీలన వ్యవస్థను నిర్మించుకోవాలని భావిస్తోంది.

ఇదీ చదవండి: అప్పుడే ఊహించా.. సమాజానికి పెద్ద సవాలు: కియోసాకి

Advertisement
 
Advertisement
Advertisement