మస్క్ కంపెనీలో జాబ్‌ కావాలా? | Dream Jobs at Elon Musk Companies Skills Salaries Secrets to Getting Hired | Sakshi
Sakshi News home page

మస్క్ కంపెనీలో జాబ్‌ కావాలా?

Apr 24 2026 11:49 AM | Updated on Apr 24 2026 12:32 PM

Dream Jobs at Elon Musk Companies Skills Salaries Secrets to Getting Hired

నేటి యువతకు ఎలాన్‌ మస్క్ ఒక ఐకాన్. ప్రపంచవ్యాప్తంగా కొంతమంది టెక్ నిపుణులకు మస్క్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడం అనేది ఒక కల. అయితే, అక్కడ సీటు దక్కించుకోవడం సులభమా? మస్క్ తన కంపెనీలో పని చేసే అభ్యర్థుల్లో ఏం ఆశిస్తారు? జీతభత్యాలు ఏ స్థాయిలో ఉంటాయి? అనే అంశాలను కింద చూద్దాం.

మస్క్ కంపెనీల వైవిధ్యం

ఎలాన్ మస్క్ కేవలం ఒక్క రంగానికే పరిమితం కాలేదు. ఆయన నాయకత్వంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసే అగ్రశ్రేణి సంస్థలు ఉన్నాయి.

టెస్లా.. ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ.

స్పేస్ ఎక్స్.. అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ ప్రయోగాలు.

ఎక్స్ గతంలో(ట్విట్టర్).. సోషల్ మీడియా దిగ్గజం.

న్యూరాలింక్.. బ్రెయిన్-చిప్ టెక్నాలజీ.

ఎక్స్‌ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలు.

టాలెంట్‌కే పెద్దపీట!

మస్క్ నియామక ప్రక్రియలో ఒక విప్లవాత్మక మార్పు ఉంది. ‘మీకు పేరుమోసిన యూనివర్సిటీ డిగ్రీ లేకపోయినా పర్వాలేదు. కానీ పని పట్ల అంకితభావం, అసాధారణమైన నైపుణ్యం ఉండాలి’ అని ఆయన స్వయంగా పలుమార్లు ప్రకటించారు.

ఎలాంటి నైపుణ్యాలకు డిమాండ్ ఉంది?

టెక్నికల్ రోల్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ఏఐ, డేటా సైన్స్, రోబోటిక్స్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్.

నాన్-టెక్నికల్ రోల్స్.. హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్‌), సేల్స్, ఆపరేషన్స్, ఫ్రంట్ డెస్క్ మేనేజ్‌మెంట్.

దరఖాస్తు, ఎంపిక విధానం

మస్క్ కంపెనీల్లో చేరాలనుకునే వారు థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల కంటే అధికారిక పోర్టల్స్ ద్వారా వెళ్లడం ఉత్తమం. దరఖాస్తు కోసం Tesla Careers.. https://www.tesla.com/careers లేదా SpaceX Careers.. https://www.spacex.com/careers వంటి అధికారిక వెబ్‌సైట్లలో మీ ప్రొఫైల్‌ను అప్‌లోడ్ చేయాలి.

స్క్రీనింగ్: రెజ్యూమెను షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత సాంకేతిక పరీక్షలు ఉంటాయి.

ఇంటర్వ్యూలు: ఇక్కడ కేవలం ప్రశ్నలు మాత్రమే ఉండవు, ప్రాక్టికల్ టాస్క్‌లు కూడా ఇస్తారు. కొన్ని కీలక పోస్టుల కోసం మస్క్ స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని కొందరు మేనేజ్‌మెంట్‌ స్థాయి వ్యక్తులు చెబుతున్నారు.

జీతాలు ఎలా ఉంటాయి? (సుమారుగా)

మస్క్ కంపెనీలు తమ ఉద్యోగులకు ప్రపంచ స్థాయి వేతనాలను అందిస్తాయి. అనుభవం, నైపుణ్యాన్ని బట్టి ప్యాకేజీలు మారుతుంటాయి.

కంపనీహోదావార్షిక వేతనం (అంచనా)
టెస్లాసాఫ్ట్వేర్ ఇంజినీర్రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్లు
స్పేస్ ఎక్స్ఇంజినీర్రూ.70 లక్షల నుంచి రూ.1.5 కోట్లు
ఇంటర్న్షిప్ఫ్రెషర్లు (స్టైఫండ్)నెలకు సుమారు రూ.1 లక్ష

 

గమనిక: పైన పేర్కొన్న వేతనాల్లో స్టాక్ ఆప్షన్స్ కూడా అంతర్భాగంగా ఉంటాయని గమనించాలి.

ఫ్రెషర్లకు అవకాశం

మీరు రీసెంట్‌గా డిగ్రీ పూర్తి చేశారా? అయితే ఇంటర్న్‌షిప్ ద్వారా మస్క్ సామ్రాజ్యంలో అడుగు పెట్టవచ్చు. టెస్లా, స్పేస్ ఎక్స్ ప్రతి సంవత్సరం వేలమంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లను అందిస్తాయి. ఇక్కడ ప్రతిభ కనబరిస్తే నేరుగా పూర్తిస్థాయి ఉద్యోగిగా మారే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: ‘మూన్‌లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ!

Advertisement
 
Advertisement
Advertisement