అన్నంతపనీ చేసిన మస్క్‌.. పార్టీ ఫ్యూచర్‌ ప్లాన్‌ ఇదే.. | Elon Musk formed a new Political Party in America | Sakshi
Sakshi News home page

అన్నంతపనీ చేసిన మస్క్‌.. పార్టీ ఫ్యూచర్‌ ప్లాన్‌ ఇదే..

Jul 6 2025 7:08 AM | Updated on Jul 6 2025 8:38 AM

Elon Musk formed a new Political Party in America

వాషింగ్టన్‌ డీసీ: టెక్‌ దిగ్గజం ఎలన్ మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ చట్టం తీసుకువచ్చిన దరిమిలా, దాన్ని వ్యతిరేకిస్తూ మస్క్‌ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. తాను  అనుకున్నది సాధించేవరకూ వదలని చెప్పే మస్క్‌ ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.

ప్రముఖ టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపనపై ప్రకటన చేశారు. ఈ పార్టీకి ‘అమెరికా పార్టీ’ అని పేరు పెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో  విభేదాల నేపధ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ఎలన్ మస్క్  తన ‘ఎక్స్‌’లో ఒక పోల్ నిర్వహించి, తన 22 కోట్ల మంది ఫాలోవర్స్‌ను ఓ ప్రశ్న అడిగారు ‘అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పాల్సిన సమయం వచ్చిందా?" అని అడిగినప్పుడు 80 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు.
 

ఈ ఫలితాలను వెల్లడిస్తూ మస్క్ ఓ ప్రకటనలో ‘అమెరికాలో 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమని తెలిపారు. ఇది ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ అభివర్ణించారు. కొత్త పార్టీ సాయంతో 2026 మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనేట్ సీట్లపై మస్క్ దృష్టి సారించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో మస్క్‌ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో  డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇప్పుడు మస్క్  ‘అమెరికా పార్టీ’ వీటికి సవాలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement