దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ పాప్ గాయని పార్క్‌బామ్ (Park Bom) ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. పార్క్‌బామ్ గతంలో చేసిన పోస్ట్‌ను కోట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
పార్క్‌బామ్ గతంలో పని చేసిన ఏజెన్సీ వైజీ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుడు యాంగ్ హ్యున్ సుక్ (Yang Hyun Suk) తనను భారీ మొత్తంలో మోసం చేశారని ఆరోపిస్తూ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆమె దాదాపు 4.5 క్వాడ్రిలియన్ డాలర్లు (రూ.4,500 లక్షల కోట్లు-Quadrillion - ఒకటి తర్వాత 15 సున్నాలు) చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఒక లీగల్ డాక్యుమెంట్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశారు. ఈ మొత్తం దాదాపు ప్రపంచ జీడీపీకి 41 రెట్లతో సమానం. దాంతో అందులో తెలిపిన మొత్తం చాలా అసాధారణంగా ఉండడంతో ఈమేరకు పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి.
Breaking:
Park Bom is expected to become the richest person in the world if she wins the case, surpassing Elon Musk.
Park Bom of 2NE1 has reportedly sued YG Entertainment for a demure amount of 1002003004006007001000034'64272e trillion won. pic.twitter.com/tCIUS60kGB— World updates (@itswpceo) October 23, 2025
ఈ వివాదంలో పార్క్‌బామ్ ఈ భారీ మొత్తాన్ని నిజంగా గెలిస్తే ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా, తొలి ట్రిలియనీర్‌గా, ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్‌ను అధిగమించిన తొలి మహిళగా మారుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు


