మేడ్చల్: జిల్లాలోని శామీర్‌పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 30 ఏళ్ల క్రితం 20 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారు. అయితే దీనిపై ఫ్రెండ్స్ కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రహరీ గోడ కూల్చివేసి రోడ్డు డైరెక్షన్ ఇవ్వడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. రూ. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. మియాపూర్ విలేజ్ ముక్తా మహబూబ్‌పేటలో ఆక్రమణలను తొలగించింది. ప్రభుత్వ ఆక్రమిత భూములపై హైడ్రా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆక్రమిత భూమి చిన్నదా.. పెద్దదా అని కాకండా హైడ్రా కూల్చివేతలు చేపడతూ వస్తంది. గత కొంతకాలంగా తెలంగాణలోని హైదరాబాద్ నగర పరిధిలోని అనేక ఆక్రమిత భూములన హైడ్రా కాపాడింది.
కాగా, గత ఏడాది నవంబర్‌లో నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించింది. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు.


