మేడ్చల్‌లో హైడ్రా కూల్చివేతలు.. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో.. | HYDRA operation At Medchal District | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌లో హైడ్రా కూల్చివేతలు.. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో..

Jun 23 2025 10:33 AM | Updated on Jun 23 2025 11:04 AM

HYDRA operation At Medchal District

సాక్షి, మేడ్చల్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మేడ్చల్‌ జిల్లా పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.

వివరాల ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొర్రెముల రెవెన్యూ పరిధి ఏకశిలానగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వెంచర్‌లో ప్లాట్లకు అడ్డుగా ప్రహరీ గోడ నిర్మించారు. దీనిపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement