హెచ్‌ఎండీఏ పర్మిషన్‌ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే | Congress MLA Malreddy Ranga Reddy Key Comments On Hydra | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎండీఏ పర్మిషన్‌ ఇస్తే.. హైడ్రా కూలగొడుతుందా?: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

Sep 12 2026 4:42 PM | Updated on Sep 12 2026 5:23 PM

Congress MLA Malreddy Ranga Reddy Key Comments On Hydra

హైదరాబాద్‌:  హైడ్రాపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం హైడ్రా అవలంభిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఒకవైపు హెచ్‌ఎండీఏ పర్మిషన్‌ ఇస్తుంటే.. మరొకవైపు హైడ్రా వచ్చి కూలగొడుతుందా? అని నిలదీశారు. ‘‘హెచ్‌ఎండీఏ పర్మిషన్‌ ఇస్తుంది.. హైడ్రా వచ్చి కూలగొడుతుంది’’ ఇదే ప్రస్తుతం జరుగుతుంది అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

అసలు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోతే ప్రజల్లో విశ్వాసం కోల్పోతామన్నారాయన. హైడ్రా-హెచ్‌ఎండీఏల మధ్య సమన్వయం లేని కారణంగా పర్మిషన్‌లు ఇవ్వడం- ఆపై కూలగొట్టడమే జరుగుతుందంటూ ఆయన​ వ్యాఖ్యానించారు. 

‘ క్యూర్ ఏరియాలో అన్ని శాఖల మధ్య  సమన్వయం అవసరం. ప్రతీ నెల సమన్వయ కమిటీ సమావేశం జరగాలి. ప్రభుత్వ శాఖలే పర్మిషన్ ఇచ్చి.. ప్రభుత్వ శాఖలే కూలగొడితే ప్రజలకు ప్రభుత్వం పై నమ్మకం పోతుంది. హైడ్రా, హెచ్‌ఎండీఏ మధ్య సమన్వయం అవసరం.  ఇలా లేకపోతే హెచ్‌ఎండీఏ పర్మిషన్‌లు ఇవ్వటం, మరొకవైపు హైడ్రా వచ్చి కూలగొట్టడమే అవుతుంది’ అని వ్యాఖ్యానించారు. 

ఇదీ చదవండి:  బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు..  వారిపై మౌనం ఎందుకు?: కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement