హైడ్రాపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజం | MLA Raja Singh Takes On Hydra | Sakshi
Sakshi News home page

హైడ్రాపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజం

Apr 26 2026 7:44 PM | Updated on Apr 26 2026 7:46 PM

MLA Raja Singh Takes On Hydra

హైదరాబాద్: హైడ్రా, మున్సిపల్‌ అధికారులపై ఎమ్మెల్యే రాజాసింగ్‌ ధ్వజమెత్తారు. గోషామహల్‌ నియోజకవర్గంలో ఫిష్‌ మార్కెట్‌ పక్కన ఉన్న డబ్బాలను తొలగించారని, తాను ఇక్కడ లేని సమయం చూసే వాటిని హైడ్రా తొలగించిందంటూ మండాపడ్డారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు దౌర్జన్యంగా తొలగించారన్నారు. 

హైడ్రాకు దమ్ముంటే దారుసలాం, ఛార్మినార్ ముందు ఉన్న అక్రమ కట్టడాలు కూల్చి చూపెట్టాలని డిమాండ్‌ చేశారు. పేద ప్రజల ఉపాధి అవకాశాలపై దౌర్జన్యం సరికాదని, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారుని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాదన్నారు. రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement