సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్‌పేటలో ఆక్రమణలను తొలగించింది.


కాగా, గత ఏడాది నవంబర్‌లో నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు.


