మళ్లీ అమీన్‌పూర్‌లో ‘హైడ్రా’ కూల్చివేతలు | Hydra Demolitions Started Again In Ameenpur Sangreddy, More Details Inside | Sakshi
Sakshi News home page

మళ్లీ అమీన్‌పూర్‌లో ‘హైడ్రా’ కూల్చివేతలు

Jan 28 2025 8:59 AM | Updated on Jan 28 2025 11:33 AM

Hydra Demolitions In Aminpur Sangreddy Again Updates

సాక్షి,హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా  అమీన్‌పూర్‌లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. ఇక్కడ హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. అమీన్‌పూర్‌ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది  కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది.  గతంలోనూ అమీన్‌పూర్‌ మునిసిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని హైడ్రాకు ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement