Hyd: హయత్‌నగర్‌లో హైడ్రా కూల్చివేతలు | HYDRA Demolitions in Hayathnagar Target Illegal Constructions | Sakshi
Sakshi News home page

Hyd: హయత్‌నగర్‌లో హైడ్రా కూల్చివేతలు

Apr 10 2026 4:05 PM | Updated on Apr 10 2026 4:15 PM

HYDRA Demolitions in Hayathnagar Target Illegal Constructions

హైదరబాద్‌: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హయత్‌నగర్‌ పరిధిలోని కుంట్లూరులో శుక్రవారం(ఏప్రిల్‌ 10వ తేదీ) హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అంజనాద్రి నగర్‌లోని 204 సర్వే నంబర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. 

కాగా, ఈనెల ఆరంభంలో  మైలార్‌దేవుపల్లి సర్కిల్‌లో హైడ్రా కూల్చివేతలు చేపట్టి సుమారు 30 కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని కాపాడింది. మైలార్‌దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయి.  ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి దిగిన హైడ్రా.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ముచేసుకున్నట్టు గుర్తించింది. 

దీంతో,  భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్‌ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది. అలాగే, మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను సైతం హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. దీని విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా సీరియస్‌గా దృష్టి పెట్టింది. జీహెచ్‌ఎంసీతో కలిసి నగరంలో వందలాది అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 

Advertisement
 
Advertisement
Advertisement