
సాక్షి, కూకట్‌పల్లి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది.
వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్ డివిజన్ హబీబ్ నగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. అక్కడ నాళాను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ నిర్మాణాలపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన హైడ్రా.. కూల్చివేతలను ప్రారంభించింది. శుక్రవారం ఉదయమే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.