హైడ్రాపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు | CM Revanth Reddy Sensational Comments On Hydra | Sakshi
Sakshi News home page

హైడ్రాపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

Jun 6 2026 4:42 PM | Updated on Jun 6 2026 6:14 PM

CM Revanth Reddy Sensational Comments On Hydra

హైదరాబాద్‌: నగరంలోని విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన సంస్థే హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency). అయితే ఇది గత కొంతకాలంగా బాగా ఫేమస్‌ అయ్యింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలకు సంబంధించి హైడ్రా పేరు మార్మోగుతూనే ఉంది. 

2024లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  ఈ సంస్థను ఏర్పాటు చేశారు.  2024, జూలైలో దీన్ని అధికారికంగా ప్రకటించారు.   ఈ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారు. 

అయితే తాజాగా హైడ్రాపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అని పేరు పెట్టడానికి గల కారణాలను వెల్లడించారు. నియంతగా పేరుగాంచిన హిట్లరే ఇందుకు కారణమన్నారు సీఎం రేవంత్‌.  హైడ్రా అనే పేరు హిట్లర్‌కు చాలా ఇష్టమని, హిట్లర్‌కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్‌ తెలిపారు. 

అందుచేత అక్రమ కట్టడాలు చేసే వారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరుపెట్టామన్నారు. హైదరాబాద్‌లో చెరువులను ఎవరు ఆక్రమించాలనుకున్నా భయపడాలని ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు. 

హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా..షాకింగ్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement