
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నాలాను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను అధికారులు నేల మట్టం చేశారు.

వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి పక్కన నాలాపైన ఆక్రమణలను హైడ్రా అధికారులు గుర్తించారు. నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. నాలాపై నిర్మించిన నిర్మాణాలను, షెడ్లను కూల్చివేసింది. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.