సీఎం రేవంత్‌ మరో కీలక నిర్ణయం.. హైడ్రాకు మరిన్ని బాధ్యతలు | Telangana govt gives HYDRAA additional powers to ghmc monsoon works | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ మరో కీలక నిర్ణయం.. హైడ్రాకు మరిన్ని బాధ్యతలు

Jun 10 2025 5:15 PM | Updated on Jun 10 2025 6:25 PM

Telangana govt gives HYDRAA additional powers to ghmc monsoon works

హైదరాబాద్‌,సాక్షి: హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా చేతికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతల్ని అప్పగించింది. వర్షాకాలంలో నగరంలో వరద ముంపు సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. వర్షాకాలంలో వరద ముంపు సమస్యలు ఇపుడు హైడ్రా చూస్తుంది.మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జీహెచ్‌ఎంసీ నుండి  హైడ్రాకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఒక గొడుగు కిందకు రావడం వల్ల పని ఈజీ అవుతుంది.

వర్షాకాలంలో మాత్రమే హైడ్రా బాధ్యత. వర్షాకాలంలో చేయాల్సినవి హైడ్రా చేస్తుంది. వర్షాకాలం ముందు చేయాల్సినవి జీహెచ్‌ఎంసీ చేస్తుంది. నాలాల రక్షణ, నాలాల్లో పూడిక తీత లేకుండా చూస్తాం. మొత్తం నగరాన్ని మార్చేస్తాం అని చెప్పను కానీ బెటర్ చేస్తాం. ఇప్పటికే విరిగిపోయి చెట్లను గుర్తిస్తున్నాం. ప్రమాదకర మ్యాన్‌ హోల్స్‌ను గుర్తిస్తున్నాం. నాలాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా చేస్తాం.

మా దగ్గర 30 టీమ్స్,జీహెచ్‌ఎంసీ వద్ద దగ్గర 150 టీమ్స్, ట్రాఫిక్ 20 టీమ్స్ ఉన్నాయి. అన్ని టీములు పని చేస్తున్నాయా లేదా చెక్ చేస్తాం.  వరద నీరు సరిగా వెళ్లేలా టీమ్స్ పని చేస్తున్నాయా లేదా అని చూస్తాం.ఎంత వర్షం పడుతుందో దాని మీద పరిస్థితి ఆధారపడి ఉంటుంది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement