సాక్షి, హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. స్థానికంగా సర్వే నెంబర్ మార్చి అక్రమ నిర్మాణం జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా అధికారులు రంగంలోకి అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మియాపూర్‌లో సర్వే నెంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. సర్వే నెంబర్ మార్చి.. హెచ్ఎండీఏ ఫెన్సింగ్ తొలగించిన నిర్మాణదారులు అక్కడ అక్రమంగా నిర్మాణాలను చేపట్టారు. ప్రభుత్వ భూమి సర్వే నంబరు 100లో అక్రమంగా 307, 308తో దొంగ రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో స్థానికులు.. హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకుండా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.



