మలయాళం స్టార్‌తో దళపతి విజయ్‌ కుమారుడు.. ఫోటో వైరల్‌

Thalapathy Vijays Son Jasons pic with Malayalam Star - Sakshi

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు దళపతి విజయ్‌. అందుకే ఆ నటించిన ప్రతి చిత్రం తెలుగులోను విడుదలవుతోంది. అయితే తాజాగా ఆయన కుమారుడు జాసన్‌ సంజయ్‌, మలయాళం స్టార్‌ నివిన్‌ పౌలితో తీసుకున్న సెల్ఫీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మలయాళం ‘ప్రేమమ్‌’ స్టార్‌ నివిన్‌ అక్టోబర్‌ 11న బర్త్‌ డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా జాసన్‌ ఆయనతో తీసుకున్న ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి విషెస్‌ చెప్పాడు. దీంతో ఆ పిక్‌ వైరల్‌గా మారింది. అయితే ఇంతకుముందు సైతం ఈ స్టార్‌కిడ్‌ స్నేహితులతో కలిసి కారులో పార్టీ చేసుకున్న వీడియో చర్చనీయాంశంగా మారింది. అయితే జాసన్ ఇప్పటికే తన తండ్రి చిత్రం వెట్టైకారన్ (2009)లో అతిధి పాత్రలో నటించి మెప్పించాడు.

చదవండి: దళపతికి ఊరట.. ‘ విజయ్‌’ మక్కల్‌ ఇయక్కం రద్దు 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top