Padavettu Director Liju Krishna In Police Custody After Molestation Allegations - Sakshi
Sakshi News home page

Padavettu Director Liju Krishna: అత్యాచార ఆరోపణలు, మలయాళ డైరెక్టర్‌పై కేసు!

Mar 7 2022 9:00 AM | Updated on Mar 7 2022 10:47 AM

Padavettu Director Liju Krishna In Police Custody After Molestation Allegations - Sakshi

డైరెక్టర్‌ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లిజు కృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు.

కేరళ: అత్యాచార ఆరోపణలతో మలయాళ డైరెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నివిన్‌ పాలీ హీరోగా నటిస్తున్న 'పడవెట్టు' సినిమాకు లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్రయూనిట్‌లోని ఓ యువతి డైరెక్టర్‌ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లిజు కృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడి అరెస్ట్‌తో షూటింగ్‌ వాయిదా వేశారు. 

పడవెట్టు సినిమాకు లిజు కృష్ణనే స్వయంగా కథ రాశాడు. ఇందులో నవీన్‌ పాలీతో పాటు మంజు వారియర్‌, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీ తిలకన్‌, షైన్‌ టామ్‌ చికో, ఇంద్రన్స్‌, సుదీష్‌, విజయరాఘవన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పడవెట్టు గతంలో తీసిన మూమెంట్‌ జస్ట్‌ బిఫోర్‌ డెత్‌కు పని చేసిన సన్నీ వేన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement