నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం | Nivin Pauly co stars Bhagath Manuel and Vineeth Sreenivasan claim the actor was with them at the time of alleged sexual assault | Sakshi
Sakshi News home page

నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం

Sep 7 2024 12:49 AM | Updated on Sep 7 2024 12:49 AM

 Nivin Pauly co stars Bhagath Manuel and Vineeth Sreenivasan claim the actor was with them at the time of alleged sexual assault

వినీత్‌ శ్రీనివాసన్,పార్వతీ ఆర్‌. కృష్ణ

సినిమా అవకాశం ఇప్పిస్తానంటూ దుబాయ్‌లో తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఓ ఆరుగురి గురించి ఇటీవల ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఆ ఆరుగురిలో మలయాళ నటుడు నివిన్‌ పౌలీ ఒకరు. అయితే ఏ తేదీల్లో (గత డిసెంబరు 14 నుంచి 16) అయితే తనతో నివిన్‌ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆ మహిళ పేర్కొన్నారో అదే తేదీల్లో ఆయన ‘వర్షంగళుక్కు శేషమ్‌’ అనే మలయాళ సినిమా షూట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్రంలో నటించినపార్వతీ ఆర్‌. కృష్ణ తెలిపారు. అలాగే ఈ చిత్రదర్శకుడు వినీత్‌ శ్రీనివాసన్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం అంటున్నారు ఈ ఇద్దరూ. ‘‘ఆ మహిళ చెప్పిన తేదీలో కేరళలోని కొచ్చిలో ‘వర్షంగళుక్కు శేషమ్‌’ షూటింగ్‌లో ఉన్నారు నివిన్‌. అక్కడి న్యూక్లియస్‌ మాల్‌ లోపల, బయట కూడా చిత్రీకరణ జరిపాం. అలాగే మా సినిమా షూటింగ్‌ ముగించుకుని ‘ఫార్మా’ అనే వెబ్‌ సిరీస్‌ షూట్‌కి వెళ్లారు. ఇక నివిన్‌ మా టీమ్‌తోనే ఉన్నారనడానికి సీసీటీవీ ఫుటేజ్, మా యూనిట్‌లోనిపార్వతీ ఆర్‌. కృష్ణ, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబూ రామ్, మా నిర్మాత విశాఖ్‌ సుబ్రమణియం తదితరులు సాక్ష్యం’’ అని పేర్కొన్నారు వినీత్‌ శ్రీనివాసన్‌. ‘‘వర్షంగళుక్కు శేషమ్‌’లో నేనో చిన్నపాత్ర చేశాను. డిసెంబర్‌ 14న మా షూటింగ్‌కి సంబంధించిన వీడియో చూపిస్తాను. ఆ రోజు నివిన్‌ కాంబినేషన్‌లో నేను కొన్ని సీన్స్‌లో నటించాను’’ అంటూ ఇన్‌స్టాలో వీడియోను షేర్‌ చేశారుపార్వతీ ఆర్‌. కృష్ణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement