హే జూడ్‌... రెడీ ఫర్‌ రైడ్‌!

Nivin Pauly and Trisha starrer promises fresh take on romance - Sakshi

ఆకాశం ఏ కలర్‌లో ఉంటుంది? బ్లూ కలర్‌లో! త్రిష రైడ్‌ చేస్తున్న బండి కలర్‌ కూడా బ్లూనే! ఆమె వెనుక సీట్‌లో కూర్చున్నది ఎవరో తెలుసా? మలయాళ హీరో నివిన్‌ పాలీ. త్రిష మాటలతో ఏం మంత్రం వేశారో మరి... నీలాకాశంలో విహరిస్తున్నట్టుంది నివిన్‌ ఎక్స్‌ప్రెషన్‌. అసలు, ఈ హీరో త్రిష బండి ఎందుకు ఎక్కారనే డౌటొచ్చిందా? ప్రస్తుతం వీళ్లిద్దరూ ‘హే జూడ్‌’ అనే మలయాళ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్‌ లుక్‌నే మీరు చూస్తున్నారు.

శ్యామప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్రిష్టల్‌ అనే అమ్మాయిగా త్రిష, జూడ్‌ అనే అబ్బాయిగా నివిన్‌ నటిస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే... నివిన్‌ని ‘హే జూడ్‌... ఆర్‌ యు రెడీ ఫర్‌ రైడ్‌?!’ అని త్రిష అడుగుతున్నట్టు లేదూ! ఈ ఫస్ట్‌ లుక్‌ విడుదల సందర్భంగా ‘‘సినిమా రెడీ అవుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చిత్రదర్శకుడు శ్యామప్రసాద్‌ పేర్కొన్నారు. మలయాళంలో త్రిషకు తొలి చిత్రమిది. హీరోయిన్‌ అయిన 15 ఏళ్ల తర్వాత... పలు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించిన తర్వాత... ఇన్నేళ్లకు మలయాళంలో ఎంట్రీ ఇస్తుండడం విశేషం!!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top