విశ్వక్ సేన్ 'కల్ట్' ట్రైలర్.. మొత్తం రక్తపాతమే | Vishwak Sen Cult Movie Trailer | Sakshi
Sakshi News home page

Cult Movie: 'స్క్విడ్ గేమ్' స్టైల్ కాన్సెప్ట్‌తో సినిమా.. ట్రైలర్ చూశారా?

Oct 18 2026 8:30 PM | Updated on Oct 18 2026 8:30 PM

Vishwak Sen Cult Movie Trailer

ఈ నగరానికి ఏమైంది?, ఫలక్‌నుమా దాస్, హిట్ సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. తర్వాతి కాలంలో రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలతో వరస ఫ్లాప్స్, డిజాస్టర్స్ చూశాడు. దీంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ టైంలో తానే దర్శకుడిగా మారి అందులో నటించి ఓ మూవీ తీశాడు. అదే 'కల్ట్'. ఈ నెల 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)

'కల్ట్' (Cult Movie) ట్రైలర్ బట్టి చూస్తే.. గోవాలో కల్ట్ అనే పబ్‌లో ఓ రోజు రాత్రి 300 మందికి పైగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే కొందరు వ్యక్తులు వీళ్లని లోపలే లాక్ చేసి ఓ గేమ్ పెడతారు. ఓడిపోతే చంపేస్తారు. అయితే ఈ పబ్‌లోనే ఇన్‌స్పెక్టర్ సంకల్ప్ నాయక్ కూడా ఉంటాడు. మరి లోపలున్న వీళ్లంతా బయటకెలా వచ్చారు. అసలు ఈ సెటప్ అంతా ఏంటి? అనేది మూవీ చూసి తెలుసుకోవాలి.

ఈ సినిమాలో కీలక పాత్ర చేసిన విశ్వక్ సేన్.. దర్శకత్వం వహించాడు. ఇందులో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ కాగా రవి బస్రూర్ సంగీతమందించాడు. ట్రైలర్‌లో చాలా సీన్స్ వయలెంట్‌గా ఉన్నాయి. యువత మాత్రమే చూసే ఈ చిత్రం ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది చూడాలి?

(ఇదీ చదవండి: కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. పదేళ్ల క్రితమే 'ఆమె' చెప్పింది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement