ఓటేసిన తర్వాత త్రిష చేసిన తొలి పోస్ట్‌ ఇదే! | After casting Vote Trisha First Instagram post Goes Viral | Sakshi
Sakshi News home page

ఓటేసిన తర్వాత త్రిష చేసిన తొలి పోస్ట్‌ ఇదే!

Apr 23 2026 7:07 PM | Updated on Apr 23 2026 7:38 PM

After casting Vote Trisha First Instagram post Goes Viral

తమిళనాడు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ముక్కోనపు పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం(టీవీకే)’ పార్టీ కూడా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగింది.దీంతో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీవీకే అధినేత హీరో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్, శ్రుతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివ కార్తికేయన్, డైరెక్టర్ అట్లీ తదితర ప్రముఖులు తమకు కేటాయించిన పోలీంగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష అని చెప్పొచ్చు. 

ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయ్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు రూమర్స్‌ రావడం.. అవి నిజమే అన్నట్లుగా ఇద్దరూ కలిసి ఓ ఫంక్షన్‌కి హాజరకావడంతో త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఓటు వేయడానికి వచ్చిన త్రిషపై  మీడియా ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. అయితే త్రిష మాత్రం సింపుల్‌గా వచ్చి ఓటు వేసి వెళ్లింది. విజయ్‌కి మద్దతుగా ఒక్క మాట మాట్లాడలేదు కానీ.. తాను టీవీకే పార్టీకే ఓటు వేశానని పరోక్షంగా చెప్పేసింది.

ఇన్‌స్టాలో తొలి పోస్ట్‌.. 
చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో తన తల్లి ఉమతో కలిసి ఓటు వేసిన త్రిష, ఆ తర్వాత తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఫోటో దిగి వెళ్లిపోయారు. కాసేపటికే ఆ ఫోటోని తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ ఫోటోకు ఆమె జోడించిన పాట ఇప్పుడు అసలైన రచ్చకు కారణమైంది.

పాటతో ఇలా చెప్పేసింది
త్రిష షేర్‌ చేసిన పోటోకి బ్యాగ్రౌండ్‌లో ఓ పాటను జోడించింది. అది విజయ్‌తో కలిసి త్రిష నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'గిల్లి'లోని 'అర్జునర్ విల్లు' అనే పాట.  కేవలం పాటను ఎంచుకోవడమే కాదు, అందులో కేవలం 'విజిల్స్'వినిపించే భాగాన్ని మాత్రమే ఆమె తన పోస్ట్‌కి జత చేసింది. ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. విజయ్‌ పార్టీ గుర్తు విజిల్‌. అందుకే త్రిష ఆ పాటతో షేర్‌ చేసిందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. విజయ్‌కు మద్దతు తెలపడానికే త్రిష ఈ పాటను వాడారని ఫ్యాన్స్‌ అంటున్నారు. ఇక విజయ్‌ అభిమానులు అయితే త్రిషను ఏకంగా ‘వదినమ్మ’అని సంభోదిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్‌ -త్రిషలు పెళ్లి చేసుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement