అక్కడ నుంచే విజయ్ ఎన్నికల ప్రచారం? | TVK's Vijay Bought Bungalow In Perambur For Election Campaign | Sakshi
Sakshi News home page

అక్కడ నుంచే విజయ్ ఎన్నికల ప్రచారం?

Mar 24 2026 5:20 PM | Updated on Mar 24 2026 5:27 PM

TVK's Vijay Bought Bungalow In Perambur For Election Campaign

చెన్నై: ఎన్నికల పనులను పర్యవేక్షించడం కోసం చెన్నైలోని పెరంబూర్‌ ప్రాంతంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఓ బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే కూటమి, నామ్ తమిళర్ కట్చి, తమిళగ వెట్రి కళగం మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది.

మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇప్పటికే పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ, తమిళనాడు అభ్యర్థుల జాబితాను ఇంకా విడుదల చేయలేదు. అయితే, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయ్ స్వయంగా పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే, పెరంబూర్ పరిధిలోని కొడుంగయ్యూర్ సమీపంలోని కన్నదాసన్ నగర్‌లో విజయ్ ఓ బంగ్లాను సొంతంగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ బంగ్లాలోనే ఉండి పనులు పర్యవేక్షించాలని విజయ్ భావిస్తున్నారని.. రేపు ఉదయం(బుధవారం) ఈ బంగ్లాలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం. తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఈ నెల‌ 30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement