బీజేపీతోనే మహిళలకు న్యాయం  | Amit Shah Mega Roadshow in Chennai | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే మహిళలకు న్యాయం 

Apr 20 2026 6:18 AM | Updated on Apr 20 2026 6:18 AM

Amit Shah Mega Roadshow in Chennai

వారికి కాంగ్రెస్, డీఎంకే ద్రోహం: అమిత్‌ షా 

సాక్షి, చెన్నై: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్, డీఎంకే లు మహిళలకు ద్రోహం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే మహిళలకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదకురిచి నియోజకవర్గ బీజేపీ కృతికా శివకుమార్‌కు మద్దతుగా ఆదివారం జరిగిన రోడ్‌షోలో  ప్రసంగించారు. అధికార డీఎంకే చేస్తున్న కుటుంబ రాజకీయాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. 

తన కొడుకు ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయడంపై  స్టాలిన్‌ దృష్టిపెట్టారని, ఈ కుటుంబ రాజకీయాలు రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయలేవని షా ఆరోపించారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ఎన్డీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే–బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో  శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని, తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకొస్తామబని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న మద్దతుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement