నామినేషన్‌ వేసిన స్టాలిన్‌, విజయ్‌.. టీవీకే అధినేత ఆస్తులెంత? | Tamil Nadu Chief Minister MK Stalin, TVK's Vijay File Nomination For Polls | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ వేసిన స్టాలిన్‌, విజయ్‌.. టీవీకే అధినేత ఆస్తులెంత?

Mar 30 2026 5:18 PM | Updated on Mar 30 2026 7:29 PM

Tamil Nadu Chief Minister MK Stalin, TVK's Vijay File Nomination For Polls
  • అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు పేర్కొన్న విజయ్‌
  • రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు  

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ఇవాళ (మార్చి 30) కోలతూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచే ఆయన 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచారు. నామినేషన్‌ దాఖలు చేసిన వెంటనే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కోలతూర్ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న అభవృద్ధి పనులపై స్టాలిన్‌ ఓ పుస్తకం విడుదల చేశారు.

"మేము భారీ విజయం సాధించనున్నాం. గత మూడు ఎన్నికలతో పోల్చితే ఈ సారి మరింత భారీగా మద్దతు కనపడుతోంది. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తమిళనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సారి భారీ విజయం సొంతమవుతుంది" అని స్టాలిన్ చెప్పారు.

డీఎంకే రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో 164 స్థానాల్లో పోటీ చేస్తుంది, 70 స్థానాలు మిత్ర పార్టీలకు సర్దుబాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి 28, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి 5, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సీపీఐఎం)కి 5, వీసీకేకు 8, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది. ఇతర చిన్న పార్టీలలో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే)కి 10, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)కి 2 స్థానాలు, ఇంకా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.

స్టాలిన్, విజయ్ నామినేషన్ దాఖలు

విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్‌ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు పట్టణ నియోజకవర్గాల నుంచి  పోటీ చేస్తున్నారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చిన విజయ్‌ నామినేషన్ సమర్పించారు. విజయ్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. విజయ్ తన అఫిడవిట్‌లో రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement