తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే విజయ్‌ | TVK Chief Vijay Moves Toward Government Formation in Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే విజయ్‌

May 4 2026 3:28 PM | Updated on May 4 2026 8:05 PM

TVK Chief Vijay Moves Toward Government Formation in Tamil Nadu

చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా టీవీకే చీఫ్‌ విజయ్‌ అడుగులు వేస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు విజయ్‌ కీలక ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థులంతా చెన్నై రావాలని పిలుపు ఇచ్చారు. ట్రెండ్‌ ప్రకారం మ్యాజిక్‌ ఫిగర్‌ 118కి చేరువలో టీవీకే ఆగిపోనుంది.

సోమవారం రాత్రి 8 గంటల నాటికి 70 స్థానాల్లో గెలిచి మరో 36 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్‌ మార్క్‌ రాకపోతే ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నదానిపై విజయ్‌ చర్చలు జరుపుతున్నారు. విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్‌, పీఎంకే సిద్ధంగా ఉన్నాయి. త​మిళనాడులో అతిపెద్ద పార్టీగా విజయ్‌ టీవీకే అవతరిస్తోంది. మరోవైపు, కాసేపట్లో తమిళనాడు సీఎం స్టాలిన్‌ గవర్నర్‌ను కలవనున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. 

కాంగ్రెస్ ఇప్పటికే విజయ్‌కు మద్దతు ఇస్తామన్న సంకేతాలు పంపింది. అలాగే టీవీకే పార్టీతో అధికారాన్ని పంచుకోవడానికి కాంగ్రెస్‌ సిద్ధంగా ఉందని విజయ్ తండ్రి చంద్రశేఖర్‌ సూచించారు. ఎన్నికల ముందు దశలో టీవీకే.. ఎఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, డీఎంకే రెండింటితోనూ కూటములను పూర్తిగా తిరస్కరించింది.

అయితే, మెజారిటీ మార్కు దాటేందుకు టీవీకేకు చిన్న ద్రావిడ పార్టీల మద్దతు అవసరం కావచ్చు. తమిళనాడుకు ఎంజీఆర్ వంటి సినీ తారలను నాయకులుగా ఎన్నుకున్న దీర్ఘ చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో విజయ్‌ కూడా చేరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement